MI Vs CSK : ఇద్దరిలో ఇప్పటివరకు ఎవరెన్నిసార్లు కప్ ఎగరేసుకెళ్లారు?

news18-telugu
Updated: May 12, 2019, 11:43 PM IST
MI Vs CSK : ఇద్దరిలో ఇప్పటివరకు ఎవరెన్నిసార్లు కప్ ఎగరేసుకెళ్లారు?
మైదానంలో ధోనీ, రోహిత్..
news18-telugu
Updated: May 12, 2019, 11:43 PM IST
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరకు విజయం ముంబైనే వరించింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్.. ఆఖరి ముంబై ఖాతాలో పడింది. చివరి ఓవర్ లసిత్ మలింగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై విజయానికి రెండు పరుగుల దూరంలో(148/7) ఆగిపోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలో నిలకడగా ఆడిన చెన్నై ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షేన్ వాట్సన్ 80(59) ఒక్కడే రాణించగా.. మరో ఎండ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ అతనికి తగిన సహకారం అందించలేదు. ధోనీ కూడా రనౌట్ కావడంతో చెన్నై గెలుపు ఆశలు సన్నగిల్లాయి.అయితే ఆ తర్వాత పుంజుకున్న చెన్నై గెలుపుకు దగ్గరగా వచ్చి బోల్తా కొట్టింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై వెంట వెంటనే డికాక్, రోహిత్ వికెట్లను కోల్పోయింది. టీమ్‌లో పొలార్డ్ 41(25) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాడు. దీంతో 20 ఓవర్లకు ముంబై 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో నేటి ఫైనల్‌తో కలిపి ముంబై ఇప్పటివరకు ఆరు ఫైనల్ మ్యాచ్‌లు ఆడగా.. మొత్తం నాలుగుసార్లు విజేతగా నిలిచింది. అటు చెన్నై నేటి మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకు 8 ఫైనల్ ఆడగా.. మూడుసార్లు విజేతగా నిలిచింది. నిజానికి నేటి మ్యాచ్‌లో ముంబై 150 పరుగులకే పరిమితం కావడంతో.. చెన్నై సునాయాసంగా గెలుస్తుందనే అంతా భావించారు. కానీ ముంబై సమిష్టిగా రాణించడంతో చెన్నైను నిలువరించి కప్‌ ఎగరేసుకెళ్లింది.



(న్యూస్18 క్రియేటివ్)

First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...