IPL 2019: అంపైర్లతో ధోనీ వాగ్వివాదం...మ్యాచ్ ఫీజులో కోత

IPL 2019: చెన్నై కెప్టెన్ ధోనీ మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాదనకు దిగడాన్ని ఐపీఎల్ నియమ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తూ అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.

news18-telugu
Updated: April 12, 2019, 12:04 PM IST
IPL 2019: అంపైర్లతో ధోనీ వాగ్వివాదం...మ్యాచ్ ఫీజులో కోత
అంపైర్లతో ధోనీ వాగ్వివాదం
  • Share this:
జైపూర్‌ వేదికగా గురువారం రాత్రి చెన్నై, రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడం తెలిసిందే. చివరి ఓవర్‌లో చెన్నై జట్టు గెలవాలంటే 18 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో మూడో బంతికి స్టోక్స్ బౌలింగ్‌లో ధోనీ ఔట్ అయ్యాడు. చెన్నై గెలవాలంటే చివరి మూడు బంతులకు 9 పరుగులు చేయాల్సి ఉంది. శాంట్నర్ బ్యాటింగ్ చేస్తుండగా...స్టోక్స్ విసిరిన నాలుగో బంతి వికెట్ల కంటే ఎత్తులో వెళ్లడం వివాదాస్పదం అయ్యింది. ఆ బంతిని తొలుత నోబాల్‌గా ప్రకటించిన అంపైర్ ఉల్హాస్...స్కైర్ లెగ్ అంపైర్‌ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్‌ను సంప్రదించిన తర్వాత వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో మైదానం వెలుపల డగౌట్‌లో ఉన్న చెన్నై సారథి ఎంఎస్ ధోని ఆవేశంగా మైదానంలోకి దూసుకొచ్చాడు. నోబాల్ నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారంటూ అంపైర్లతో వాగ్వివాదానికి దిగాడు.

ధోనీ మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాగ్వివాదానికి దిగడంతో వివాదాస్పదంగా మారింది. ధోనీ చర్యను ఐపీఎల్ నియమ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తూ అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. అంపైర్లతో ధోనీ వాదనకు దిగడాన్ని లెవల్-2 తప్పిదంగా పరిగణిస్తూ ఈ జరిమానా విధించారు.

మ్యాచ్‌లో చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా...శాంట్రర్ సిక్సర్ కొట్టడంతో చెన్నై జట్టు విజయం సాధించింది. 43 బంతుల్లో మూడు సిక్స్‌లు, రెండు బౌండరీలతో 58 పరుగులు సాధించిన ధోనీ మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. తదుపరి చెన్నై జట్టు ఆదివారం రోజున కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
First published: April 12, 2019, 11:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading