బామ్మ కోసం దిగి వచ్చిన మాహేంద్ర సింగ్ ధోనీ... ‘మాహీ’ని ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్‌...

ధోని కోసం స్టేడియానికి వచ్చిన బామ్మను స్వయంగా కలిసిన మాహీ... అప్యాయంగా పలకరించి, ఆమెతో సెల్ఫీ దిగిన ‘కెప్టెన్ కూల్’...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 5, 2019, 3:32 PM IST
బామ్మ కోసం దిగి వచ్చిన మాహేంద్ర సింగ్ ధోనీ... ‘మాహీ’ని ఆకాశానికి ఎత్తేస్తున్న ఫ్యాన్స్‌...
బామ్మ కోసం దిగి వచ్చిన మాహేంద్ర సింగ్ ధోనీ... ‘మాహీ’ని ఆకాశానికి ఎత్తేసిన ఫ్యాన్స్‌...
  • Share this:
మహేంద్ర సింగ్ ధోనీ... ఈ మధ్యకాలంలో క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు వినిపించినంతగా మరో పేరు వినిపించలేదు. అలాగని ధోనీ సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ పరుగుల సునామీ ఏమీ సాధించడం లేదు. కెప్టెన్‌గానూ ఎప్పుడూ రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అయినా ధోనీ మానియా ఏ మాత్రం తగ్గడం లేదంటే అందుకు కారణం... ఫ్యాన్స్‌తో ఆయన నడుచుకునే విధానమే. వికెట్ కీపర్‌గా, మ్యాచ్ ఫినిషర్‌గా ఎన్నో రికార్డులు సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ సారథిగా మూడుసార్లు టైటిల్స్ అందించాడు. ఇప్పుడు చెన్నైకి జనాల్లో అంత ఫాలోయింగ్ ఉందంటే దానికి కారణం వన్ అండ్ వోన్లో ధోనీ. ఇప్పుడు మరోసారి తన సింప్లిసిటీతో ఫ్యాన్స్‌ను ఫిదా చేసేశాడు ధోని. బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన CSK vs MI మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ఓ వృద్ధురాలు... ‘కేవలం మహేంద్ర సింగ్ ధోనీ కోసమే నేను ఇక్కడున్నా!’ అంటూ ఫ్లకార్డ్ పట్టుకుని నిల్చుంది. ఈ ఫ్లకార్డ్ ‘కెప్టెన్ కూల్’ మాహీ దృష్టిలో పడింది.

వెంటనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బామ్మను వెతుక్కుంటూ పెవిలియన్ చేరుకున్న ధోనీ... ఆమెతో ఆప్యాయంగా మాట్లాడాడు. ధోనీ సింప్లిసిటీకి మెచ్చిన ఆ బామ్మ... మాహీ భుజాల మీద చేతులు వేసి ఎంతో అప్యాయంగా మాట్లాడింది. బామ్మతో పాటు వచ్చిన మనవరాలితో కలిసి ధోనీ సెల్ఫీ దిగాడు. ఆమె కోరిక ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన ధోనీ... వారు మరిచిపోలేని మధురానుభూతులను మిగిల్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన మొత్తం వీడియోలో రికార్డు చేసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారులు. తనను కలవడానికి స్టేడియంలోపలికి వచ్చిన ఫ్యాన్స్‌ను పరుగులు పెట్టిస్తూ ఆటపట్టించిన ధోనీ... ఇప్పుడు బామ్మ కోసం స్వయంగా ఇంత కిందకి దిగిరావడం చూసి ఆయన ఫ్యాన్స్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ‘మా తలైవా మనసు వెన్న’ అంటూ పోస్టులు పెడుతూ, ధోనీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఐపీఎల్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ఇదే...

Published by: Ramu Chinthakindhi
First published: April 5, 2019, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading