DC vs RCB: ఆర్‌సీబీని చిత్తు చేసి...ప్లేఆఫ్స్‌లో చోటుదక్కించుకున్న ఢిల్లీ కాపిటల్స్...

Royal Challengers Bangalore VS Delhi Capitals Delhi Capitals : ఈ విజయంతో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమే కాదు పాయింట్ల పట్టికలోనూ మొదటి స్థానంలో నిలిచింది.

news18-telugu
Updated: April 28, 2019, 10:22 PM IST
DC vs RCB: ఆర్‌సీబీని చిత్తు చేసి...ప్లేఆఫ్స్‌లో చోటుదక్కించుకున్న ఢిల్లీ కాపిటల్స్...
విజయోత్సాహంతో ఢిల్లీ జట్టు... (IPL)
news18-telugu
Updated: April 28, 2019, 10:22 PM IST
ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ మొదలైంది. ఫెరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచులో ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ లో తన బెర్తు కన్ఫా్ర్మ్ చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని చేజ్ చేసేందుకు బరిలోకి దిగిన బెంగుళూరుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. అయితే పార్థివ్ పటేల్ 39 పరుగులు చేసి వెనుదిరగడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆ తర్వాత రెండో బంతికే కోహ్లీ సైతం ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డివిలీర్స్, దూబే కాస్త ఆదుకున్నప్పటికీ స్కోరు బోర్డు వేగం మాత్రం మందగించింది. చివర్లో గురుకీరత్ సింగ్, స్టోయినిస్ మ్యాచ్ నిలబెట్టే ప్రయత్నంచేసినా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి బెంగుళూరు 171 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో ఢిల్లీ కాపిటల్స్ జట్టు బెంగుళూరును 16 పరుగుల తేడాతో ఓడించింది.

ఇదిలా ఉంటే మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శిఖర్ ధావన్ (50), శ్రేయస్ అయ్యర్ (52) రాణించారు. చివర్లో రూథర్ ఫోర్డ్ 6 సిక్సర్లతో విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. దీంతో ఢిల్లీ కాపిటల్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అయితే ఈ విజయంతో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోవడమే కాదు పాయింట్ల పట్టికలోనూ మొదటి స్థానంలో నిలిచింది.

First published: April 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...