RCB vs KXIP: పోరాడి ఓడిన పంజాబ్... గెలిచి ప్లేఆఫ్ బరిలో నిలిచిన బెంగళూరు...

నికోలస్ పూరన్ 46 పరుగులు, 42 పరుగులు చేసిన రాహుల్... మూడు వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 7:00 AM IST
RCB vs KXIP: పోరాడి ఓడిన పంజాబ్... గెలిచి ప్లేఆఫ్ బరిలో నిలిచిన బెంగళూరు...
నికోలస్ పూరన్ 46 పరుగులు, 42 పరుగులు చేసిన రాహుల్... మూడు వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 7:00 AM IST
IPL 2019 Live Score, RCB vs KXIP Match at Chinnaswamy Stadium: వరుస ఓటములతో సతమతమైన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఎట్టకేలకు ఫ్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకునేందుకు పోరాడగలుగుతోంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది విరాట్ సేన. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు...నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 185 పరుగులకే పరిమితమైంది. భారీ టార్గెట్ చేధనను ధాటిగా ప్రారంభించిన పంజాబ్... 3.1 ఓవర్లలోనే 42 పరుగులు రాబట్టింది. అయితే 10 బంతుల్లో 23 పరుగులు చేసిన క్రిస్‌గేల్‌ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. అయితే ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, రాహుల్ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 59 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత మయాంక్ (35 పరుగులు) అవుట్ అయ్యాడు. ఆ వెంటనే 42 పరుగులు చేసిన రాహుల్ కూడా అవుట్ కావడంతో పంజాబ్ పనైపోయిందని అనుకున్నారంతా. అయితే డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్ కలిసి అద్భుతంగా పోరాడారు. 8 ఓవర్లలో 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత ఒకే ఓవర్‌లో ఈ ఇద్దరిని అవుట్ చేసి, పంజాబ్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు నవ్‌దీప్ శైనీ. డేవిడ్ మిల్లర్ 24 పరుగులు, నికోలస్ పూరన్ 46 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 26 పరుగులు కావల్సిన దశలో అశ్విన్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికి అశ్విన్‌ను అవుట్ చేసిన ఉమేశ్ యాదవ్, హర్దూస్ విల్‌జిన్‌ను డకౌట్ చేశాడు. దాంతో ఆఖరి ఓవర్‌లో 9 పరుగులే రాబట్టగలిగింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కగా, నవ‌దీప్‌ శైనీకు రెండు, మొయిన్ ఆలీ, స్టోయినిస్‌లకు చెరో వికెట్ దక్కాయి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు...నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభంలో విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 3 ఓవర్లలోనే 35 పరుగులు రాబట్టింది. అయితే నాలుగో ఓవర్ మొదటి బంతికే విరాట్‌ కోహ్లీ(13 పరుగులు)ని అవుట్ చేసిన షమీ... ఆర్‌సీబీకి మొదటి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత 24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన పార్థివ్ పటేల్‌ను మురుగన్ అశ్విన్ అవుట్ చేయగా... మొయిన్ ఆలీ 4 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అక్ష్‌దీప్ సింగ్ కూడా 3 పరుగులకే పెవిలియన్ చేరడంతో 81 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బెంగళూరు. ఆ తర్వాత ఏబీ డివిల్లియర్స్, మార్కస్ స్టోయినిస్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు.

షమీ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు సాధించి 21 పరుగులు రాబట్టాడు డివిల్లియర్స్. ఆ తర్వాత విల్‌జీన్ వేసిన ఆఖరి ఓవర్లో డివిల్లియర్స్ ఓ సిక్స్, స్టోయినిస్ వరుసగా ఫోర్, సిక్స్, ఫోర్,సిక్స్‌తో బాదడంతో బెంగళూరు 200 పరుగుల మైలురాయిని దాటింది. 44 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేసిన డివిల్లియర్స్, 34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్... ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 66 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.



First published: April 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...