స్టేడియంలోనే ఏడ్చేసిన కోచ్ టామ్ మూడీ... భావోద్వేగానికి గురైన కేన్ విలియంసన్...

17వ ఓవర్ దాకా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చూపించిన సన్‌రైైజర్స్ హైదరాబాద్... థంపీ వేసిన 18వ ఓవర్‌లో రెచ్చిపోయిన రిషబ్ పంత్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 9, 2019, 2:41 PM IST
స్టేడియంలోనే ఏడ్చేసిన కోచ్ టామ్ మూడీ... భావోద్వేగానికి గురైన కేన్ విలియంసన్...
17వ ఓవర్ దాకా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చూపించిన సన్‌రైైజర్స్ హైదరాబాద్... థంపీ వేసిన 18వ ఓవర్‌లో రెచ్చిపోయిన రిషబ్ పంత్...
  • Share this:
క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు. అదో ఎమోషన్. భారత జట్టు క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిందని కన్నీళ్లు పెట్టుకునేవాళ్లు, నచ్చిన క్రికెటర్ అవుటైతే భావోద్వేగానికి గురయ్యేవాళ్లు లక్షల్లో ఉంటారు. ఏ ఆటలో అయినా గెలుపు, ఓటములు సహజమే అయినా ఓటమిని తట్టుకోలేక బోరున విలపిస్తుంటారు కొందరు క్రికెటర్లు. తాజాగా ఐపీఎల్ ఎలిమినేటర్-1లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ తలబడిన మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. 17వ ఓవర్ దాకా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చూపించిన సన్‌రైైజర్స్ హైదరాబాద్, థంపీ వేసిన 18వ ఓవర్‌లో పట్టుకోల్పోయింది. యంగ్ సన్సేషన్ రిషబ్ పంత్ వరుసగా 4,6,4,6 బాదడంతో లక్ష్యం 12 బంతుల్లో 12 పరుగులకు పడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే అనుకున్న మ్యాచ్‌ను ఒక్కసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ వైపు తిప్పేశాడు రిషబ్ పంత్. కేవలం 12 పాయింట్లు మాత్రమే ఉన్నా మెరుగైన రన్‌రేట్ కారణంగా ఫ్లేఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్... నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరాజయంతో టోర్నీ నుంచి నిరాశగా వెనుదిరిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
ఈ మ్యాచ్‌లో 18వ ఓవర్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖాయమని గ్రహించిన కోచ్ టామ్ మూడీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పెవిలియన్‌లో కూర్చున్న టామ్ మూడీ కన్నీళ్లు పెట్టుకుంటూ, టవల్‌లో తూడ్చుకోవడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. కోచ్ టామ్ మూడీ కన్నీళ్లు పెట్టుకోవడాన్ని స్క్రీన్ మీద చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఈ దృశ్యాలను సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ కెరీర్‌లో తమ జట్టు ఓడిపోతే ఏడ్చిన తొలి కోచ్ టామ్ మూడీ... ఐపీఎల్ అంటే కేవలం కోట్లు గుమ్మరించే టోర్నీ మాత్రమే కాదు... ఇదో ఎమోషనల్ అటాచ్‌మెంట్ అంటూ ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

First published: May 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading