DC vs SRH: ఇంటికి చేరిన హైదరాబాద్... ఢిల్లీ ఘన విజయం... పృథ్వీషా, పంత్ అద్భుత ఇన్నింగ్స్...

పృథ్వీషా హాఫ్ సెంచరీ... ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న రిషబ్ పంత్... నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... 10న చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలబడబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌... ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్‌తో ఫైనల్‌లో ఢీకొంటుంది.

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 9, 2019, 10:14 AM IST
DC vs SRH: ఇంటికి చేరిన హైదరాబాద్...  ఢిల్లీ ఘన విజయం... పృథ్వీషా, పంత్ అద్భుత ఇన్నింగ్స్...
రిషబ్ పంత్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 9, 2019, 10:14 AM IST
IPL 2019 Live Score, DC vs SRH Match Eliminator in Vizag: 12వ సీజన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు ముగిసింది. 12 పాయింట్లతో ఫ్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసిన హైదరాబాద్, ఢిల్లీ చేతిలో పోరాడి ఓడింది. 163 పరుగుల లక్ష్యంలో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్... 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయంతో చెన్నైతో పోరాటానికి అర్హత సాధించింది. యంగ్ సెన్సేషనల్ ప్లేయర్స్ పృథ్వీషా, రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. శిఖర్ ధావన్, పృథ్వీషా ధాటిగా బ్యాటింగ్ చేసి 7.3 ఓవర్లలో 66 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు. శిఖర్ ధావన్ 17 పరుగులు చేసి అవుట్ కాగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసిన పృథ్వీషా... అవుట్ అయ్యాడు. కోలిన్ మున్రో 14 పరుగులు, రూథర్డ్‌ఫర్డ్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు చేసిన రిషబ్ పంత్, భువనేశ్వర్ బౌలింగ్‌లో నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో విజయానికి 2 పరుగులు అవసరమైన దశలో అమిత్ మిశ్రా అవుట్ కావడంతో ఉత్కంఠ రేగింది. అయితే తర్వాత బంతికే బౌండరీ బాదిన కిమో పాల్ ఢిల్లీకి విజయాన్ని అందించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన మొదటి బంతికే అద్భుత బంతితో బౌల్ట్... వృద్ధమాన్ సాహాను అవుట్ చేశాడు. అయితే రివ్యూ తీసుకున్న సాహాకు అనుకూలంగా నిర్ణయం రావడంతో సన్‌రైజర్స్ ఓపెనర్ బతికిపోయాడు. గప్టిల్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో మూడు ఓవర్లలో 30 పరుగులు రాబట్టింది హైదరాబాద్. ఆ తర్వాత సాహా అవుట్ అయ్యాడు. నాలుగో ఓవర్ మొదటి బంతికే సాహాను అవుట్ చేశాడు ఇషాంత్ శర్మ. గప్టిల్ 19 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మనీశ్ పాండే 30 పరుగులు, కేన్ విలియంసన్ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. విజయ్ శంకర్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీపక్ హూడా 4 పరుగులు, నబీ 20 పరుగులు చేయగా రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. చివరి ఓవర్‌లో వరుస బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అందులో ఒకే బంతికి రెండు వికెట్లు ఉండడం విశేషం. వైడ్‌కి పరుగు తీసే ప్రయత్నంలో దీపక్ హుడా రనౌట్ కాగా, తర్వాతి బంతికి రషీద్ ఖాన్ క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరాడు. కిమో పాల్‌కు మూడు వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. బౌల్ట్,అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు.

First published: May 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...