DC vs MI: ముంబై ఇండియన్స్ ఘన విజయం... ఢిల్లీని చిత్తుగా ఓడించి...

IPL 2019 Live Score, DC vs MI Match at Feroz Shah Kotla: రాహుల్ చాహార్‌‌కు మూడు వికెట్లు, రెండు వికెట్లు తీసిన బుమ్రా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 19, 2019, 7:21 AM IST
DC vs MI: ముంబై ఇండియన్స్ ఘన విజయం... ఢిల్లీని చిత్తుగా ఓడించి...
IPL 2019 Live Score, DC vs MI Match at Feroz Shah Kotla: రాహుల్ చాహార్‌‌కు మూడు వికెట్లు, రెండు వికెట్లు తీసిన బుమ్రా...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 19, 2019, 7:21 AM IST
IPL 2019 Live Score, DC vs MI Match at Feroz Shah Kotla: రెండు సీజన్ల నుంచి ఢిల్లీపై విజయం సాధించని ముంబై ఇండియన్స్... ఎట్టకేలకు ఘనవిజయంతో పరాజయాలకు ముగింపు పలికింది. యంగ్ ఢిల్లీ టీమ్‌ను 40 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 200కు పైగా భారీ స్కోరును చేధించి, రికార్డు క్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, కష్టసాధ్యం కాని 169 పరుగుల లక్ష్యాన్ని ఎంతో తేలిగ్గా కొట్టేస్తుందని అనుకున్నారు అభిమానులు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ ఢిల్లీ, ముంబై చేతిలో చిత్తుగా ఓడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 128 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీషా చక్కగా బ్యాటింగ్ చేయడంతో ఆరంభంలో స్కోరు బోర్డు బాగానే పరుగులు పెట్టింది. అయితే మొదటి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 35 పరుగులు చేసిన శిఖర్ ధావన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పృథ్వీషా కూడా 20 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో ఢిల్లీ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోయారు. కోలిన్ మున్రో 3, శ్రేయాస్ అయ్యర్ 3, పంత్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఢిల్లీ. అయితే క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్ కలిసి కాసేపు పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ 11 పరుగులు చేసిన క్రిస్ మోరిస్‌‌ను మలింగ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కీమో పాల్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. 26 పరుగులు చేసిన అక్షర్ పటేల్‌‌ను బుమ్రా బౌల్డ్ చేయడంతో ఢిల్లీ పరాజయం ఖాయమైపోయింది. రబాడా 9 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ కాగా, అమిత్ మిశ్రా 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.


అంతకుముందు టాస్ గెలిచి, బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదుచేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డి కాక్ కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 6.1 ఓవర్లలో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. బెన్ కట్టింగ్ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. 35 పరుగులు చేసిన డి కాక్ కూడా రనౌట్ కావడంతో 74 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ముంబై జట్టు. సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు, హార్ధిక్ పాండ్యా 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కృనాల్ పాండ్యా 26 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాండ్యా బ్రదర్స్ దూకుడు కారణంగా చివరి 3 ఓవర్లలో 50 పరుగులు రాబట్టింది ముంబై జట్టు. ఢిల్లీ బౌలర్లలో రబాడాకు రెండు వికెట్లు దక్కగా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో 8వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. క్రిస్‌గేల్, మెక్ కల్లమ్, పోలార్డ్, మాలిక్, వార్నర్, రైనా, రోహిత్ తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ.



First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...