హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్ వయా పాకిస్థాన్.. ప్రభుత్వాధికారుల హస్తం.. హైదరాబాద్ తో లింకులు..

IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్ వయా పాకిస్థాన్.. ప్రభుత్వాధికారుల హస్తం.. హైదరాబాద్ తో లింకులు..

ఐపీఎల్ బెట్టింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

ఐపీఎల్ బెట్టింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

IPL Betting: ఈ బెట్టింగ్ లావాదేవీల కోసం ఈ ముఠా నకిలీ పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచింది. బ్యాంకు అధికారులు కూడా ఈ వ్యవహారంలో కుమ్మక్కయ్యారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టీ20 టోర్నమెంట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. ఈ మేరకు శనివారం ఓ అధికారి వెల్లడించారు. పాకిస్థాన్‌తో నేరుగా సంబంధాలున్న ఐపీఎల్ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై సీబీఐ విచారణ జరుపుతోంది. పలు నగరాల్లో పలువురిపై విచారణ జరుగుతోంది. ఎఫ్‌ఐఆర్‌లో "తెలియని పబ్లిక్ సర్వెంట్స్" పేర్లు కూడా నమోదు చేయబడ్డాయి. పాకిస్థాన్ నుంచి అందే సూచనల ఆధారంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తున్న క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. IPL మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేసే నెట్‌వర్క్ గురించి విశ్వసనీయ సమాచారం అందడంతో ఈ దర్యాప్తును ప్రారంభించింది. ఈ నెట్‌వర్క్‌లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్ నగరాలకు చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు ఉన్నారు.

IPL Bettingలో పందెం కాసే విధంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పని చేస్తోంది. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ నేరాలతోపాటు అవినీతి నిరోధక చట్టం ప్రకారం శుక్రవారం రెండు కేసులను సీబీఐ (CBI) నమోదు చేసింది. ఓ FIR (ప్రథమ సమాచార నివేదిక)లో సీబీఐ పేర్కొన్న వివరాల ప్రకారం, IPL మ్యాచ్‌ల ఫలితాన్ని ప్రభావితం చేసే క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తుల నెట్‌వర్క్ గురించి CBIకి విశ్వసనీయ సమాచారం అందింది. పందెం కాసేలా చేయడానికి ప్రజలను ప్రలోభపెడుతోంది.

ఈ బెట్టింగ్ లావాదేవీల కోసం ఈ ముఠా నకిలీ పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచింది. బ్యాంకు అధికారులు కూడా ఈ వ్యవహారంలో కుమ్మక్కయ్యారు. భారత దేశం (India)లోని ప్రజల నుంచి బెట్టింగ్ ద్వారా సంపాదించిన సొమ్ములో కొంత భాగం హవాలా లావాదేవీల ద్వారా విదేశాలకు తరలి వెళ్తోంది. నిందితులు పాకిస్థాన్‌లోని వకాస్ మాలిక్‌తో నిరంతరం మాట్లాడుతూ ఉంటారు. ప్రాథమిక దర్యాప్తులో వకాస్ ఫోన్ నెంబర్ లభించింది.

ఇది కూడా చదవండి : క్రికెట్ లో ఆండ్రూ సైమండ్స్ కూడా బ్యాడ్ బాయ్.. తప్ప తాగి మ్యాచ్ కి వచ్చేవాడు..

ఈ ఎఫ్ఐఆర్‌లో దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసులను నిందితులుగా సీబీఐ పేర్కొంది. ఈ నెట్‌వర్క్ 2013 నుంచి బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోందని తెలిపింది. నిందితుల బ్యాంకు ఖాతా ద్వారా దాదాపు రూ.10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు వివరించింది. CBI నమోదు చేసిన రెండో ఎఫ్ఐఆర్‌లో సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులను నిందితులుగా పేర్కొంది.

వీరు 2010 నుంచి IPL Cricket Betting నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వీరు జరిపిన లావాదేవీల విలువ రూ.1 కోటి మేరకు ఉంటుందని తెలిపింది. ఈ కేసు 2019 IPL మ్యాచ్ బెట్టింగ్‌కు సంబంధించినది. బెట్టింగ్ రాకెట్‌లో పాల్గొన్న నిందితులు పాకిస్తాన్ అకౌంట్ నంబర్ 92332222226666 కి లావాదేవీలు జరుపుతున్నారు.

First published:

Tags: Betting, Cricket, Cricket betting, IPL, IPL 2019, Pakistan

ఉత్తమ కథలు