ఐపీఎల్‌కు మునపటి జోష్.. ఫ్యాన్స్‌కు ఇక పండుగే!


Updated: July 20, 2020, 1:20 PM IST
ఐపీఎల్‌కు మునపటి జోష్.. ఫ్యాన్స్‌కు ఇక పండుగే!
కరోనా నుంచి ఏ మాత్రం ఉపశమనం లభించినా... టి20 ప్రపంచకప్ నిర్వహించాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టి20 ప్రపంచకప్‌ దాదాపుగా వాయిదా పడిందని ఆస్ట్రేలియా జట్టు తమ సభ్యులకు సంకేతాలు ఇచ్చింది.
  • Share this:


టీ20 వరల్డ్ కప్‌పై ఐసీసీ సోమవారం జరిగే సమావవేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. వాయిదా లాంఛనమే అయినప్పటీకి ఈ విషయాన్ని సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి విజృభిస్తున్న వేళ ఆటగాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా టీ20 ప్రపంచ కప్‌ను రద్దు చేయాలని బోర్డు ఇప్పటికే నిర్ణయించింది.

ఈ మెగా ఈవెంట్‌‌కు ఆతిథ్యం ఇచ్చే ఆస్ట్రేలియా.. టోర్ని నిర్వహించే పరిప్థితి లేదని చేప్పడంతో ఐసీసీ వాయిదా ప్రకటన చేయడం తప్ప చేయగలిందేమీ లేదు. ఒక్కవేళ ఈవెంట్‌ను వాయిదా వెస్తున్నట్లు నిర్ణయం వెలుపడితే ఇది ఐపీఎల్‌–13కు అనుకూలంగా మారే అవకాశం ఉంది.గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఐపీఎల్ టోర్నికి టీ20 వాయిదా ప్రకటనతో మార్గం సుగుమమం అవుతోంది.ఐపీఎల్‌కు మునపటి జోష్

టీ20 ప్రపంచ కప్ వాయిదా పడితే ఐసీసీ నిర్వహించే ఏ మెగ ఈవెంట్ దగ్గరలో ఉండదు. దీంతో ఆటగాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి వారు ఐపీఎల్ ఆడడానికి ముందుకువచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ఆటగాళ్ళు ఎక్కువగా మంది ఐపీఎల్ పాల్గోంటారు ఇక టోర్నీకి మునపటి జోరు కనిపిస్తుంది. ఐపీఎల్ ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్న అభిమానులు త్వరలోనే తీపి కబురు అందనుంది.వేదికను సిద్దంచేసుకున్న దుబాయ్

ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బోర్డు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికను కూడా సిద్ధం చేసుకుంది. దేశంలో రోజురోజుకీ వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఱ్య 10 లక్షల మార్క్‌ను దాటడంతో భారత్‌లో లీగ్‌కు కొనసాగించడం కష్టమేనని బీసీసీఐ అనుకుంటుంది. దీంతో దుబాయ్‌లోనే

ఈవెంట్ నిర్వహించాలనుకుంటుంది. కుదించైనా సరే లీగ్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది.
Published by: Rekulapally Saichand
First published: July 20, 2020, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading