Home /News /sports /

IOC URGES INDIAS ISOLATION SUSPENDS TALKS ON HOSTING FUTURE EVENTS AFTER PAKISTANI SHOOTERS DENIED VISA MS

బిగ్ షాక్ : భారత్‌ను ఏకాకిని చేస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ?

ప్రతీకాత్మక చిత్రం ( image/AP)

ప్రతీకాత్మక చిత్రం ( image/AP)

ఈ నెల 20 నుంచి 28 వరకు న్యూఢిల్లీ వేదికగా జరగనున్న షూటింగ్‌ ప్రపంచకప్‌లో పాల్గొనడానికి మొదట పాకిస్థాన్‌ క్రీడాకారులకు భారత్ అనుమతించింది. అయిరును తీవ్రంగా తప్పు పడుతోంది.

    అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC)భారత్‌కు షాక్ ఇచ్చింది. ఢిల్లీ వేదికగా జరగనున్న షూటింగ్ వరల్డ్ కప్ 2019లో పాల్గొనేందుకు ఇద్దరు పాకిస్తానీలకు భారత్ వీసా నిరాకరించడంపై ఐఓసీ సీరియస్ అయింది. ఫ్యూచర్ ఈవెంట్స్‌కు సంబంధించిన భారత్ దరఖాస్తులన్నింటిని రద్దు చేయడంతో పాటు ఇకపై భారత్‌లో ఎలాంటి పోటీలు నిర్వహించరాదని,భారత్‌కు ఈవెంట్ అనుమతులను ఇవ్వకూడదని అంతర్జాతీయ క్రీడా సమాఖ్య(ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్)ను కోరింది.

    క్రీడల పరంగా ఇది భారత్‌ను ఏకాకిని చేసే చర్య లాంటిదనే చెప్పాలి. క్రీడాకారులకు వీసాలు నిరాకరించడం ఒలింపిక్ నిబంధనలకు విరుద్దమని, క్రీడల్లో వివక్ష, రాజకీయ జోక్యాన్ని తాము సహించమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది.

    పాక్ క్రీడాకారులకు వీసా నిరాకరణ గురించి తెలిసినప్పటి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నాం. అయినప్పటికీ దీనికి ఎలాంటి పరిష్కారం దొరకలేదు. దీంతో ఫ్యూచర్ స్పోర్ట్స్ ఈవెంట్స్‌కు సంబంధించి భారత్‌తో చర్చలన్నింటిని రద్దు చేయాలని IOC నిర్ణయించింది.
    అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ


    ఈ వరల్డ్ కప్ ప్రదర్శన ఆధారంగానే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు బెర్తులు ఖరారు కానున్నాయి. దీంతో తమ షూటర్ల భవితవ్యం పాక్ ఆందోళన వ్యక్తం చేసింది.పాక్ షూటర్లు పాల్గొనాల్సిన 25 మీటర్ల ర్యాపిడ్‌ పిస్టల్‌ ఈవెంట్‌ను రద్దు చేయాలని కోరింది. దీంతో ఈవెంట్ రద్దుకు బదులు ఒలింపిక్ అర్హతకు ఈ ఈవెంట్‌ను పరిగణలోకి తీసుకోమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. మిగతా ఈవెంట్స్‌ను మాత్రం ఒలింపిక్ అర్హతకు ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపింది.

    కాగా, ఈ నెల 20 నుంచి 28 వరకు న్యూఢిల్లీ వేదికగా జరగనున్న షూటింగ్‌ ప్రపంచకప్‌లో పాల్గొనడానికి మొదట పాకిస్థాన్‌ క్రీడాకారులకు భారత్ అనుమతించింది. అయితే పుల్వామా దాడి నేపథ్యంలో నిర్ణయాన్ని మార్చుకున్న భారత్ పాక్ షూటర్స్‌కు వీసాలను నిరాకరించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ భారత్ తీరును తీవ్రంగా తప్పు పడుతోంది.







    First published:

    Tags: India, Pakistan, Pulwama Terror Attack, Youth Olympics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు