Olympics: సిల్వర్ మెడల్ విజేత మీరాబాయ్ చానుకు షాక్.. ఐవోసీ కఠిన నిర్ణయం..

ఒలింపిక్ రజత పతకం విజేత మీరాబాయ్ చానుకు షాక్.. ఐవోసీ ఆ నిర్ణయంతో.. (SAI Media/Twitter)

పుట్టిన రోజు నాడే ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ రజత పతకం విజేత మీరాబాయ్ చానుకు షాక్ తగిలింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కఠిన నిర్ణయం తీసుకున్నది.

  • Share this:
    టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత్‌కు తొలి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ (Weight Lifter) మీరాబాయ్ చాను (Mirabai Chanu) ఆదివారం పుట్టిన రోజు జరుపుకున్నది. సిల్వర్ మెడల్ (Silver Medal) తెచ్చిన ఆనందంలో తొలి సారి సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న సమయంలోనే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) (IOC) ఆమెకు షాక్ ఇచ్చే నిర్ణయం వైపు అడుగులు వేసింది. ప్యారీస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics) నుంచి వెయిట్ లిఫ్టింగ్‌ను జాబితా నుంచి తొలగిస్తున్న ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేసింది. ఇకపై ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ ఉండబోదని ఐవోసీ ఆదివారం స్పష్టం చేసింది. ఆదివారం జరిగిన సమావేశంలో ఐవోసీ సభ్యులు ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇకపై మీరాబాయ్ చాను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశమే లేకుండా పోయింది. పురుషుల విభాగంలో తొలి ఒలింపిక్స్‌లోనే వెయిట్ లిఫ్టింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 1920 నుంచి ఇది రెగ్యులర్ ఈవెంట్‌గా ఉంటూ వచ్చింది. ఇక మహిళల విభాగంలో 2000 నుంచి ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ ఒక ఈవెంట్‌గా చేర్చారు. అయితే వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా రిస్క్‌తో కూడుకున్న క్రీడ కావడంతో దీన్ని తొలగించాలని ఐవోసీ నిర్ణయం తీసుకున్నది.

    వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్లకు ప్రమాదకరంగా ఉండటంతో చాలా మంది డోపింగ్‌కు పాల్పడుతున్నట్లు ఐవోసీ గుర్తించింది. సుదీర్ఘ కాలంగా వెయిట్ లిఫ్టర్లు డ్రగ్స్ వాడుతూ కెరీర్ కొనసాగిస్తున్నారని చెబుతున్నది. గతంలోనే ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్)కు ఐవోసీ హెచ్చరికలు జారీ చేసింది. వెయిట్ లిఫ్టర్లలో ఎక్కువ మంది డోపీలు తేలుతున్నారు. కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా సంస్కరణలు తీసుకొని రావాలని ఆదేశించింది. అయినా సరే వెయిట్ లిఫ్టర్లలో మార్పు రాలేదు. దీనిపై అనేక పిర్యాదులు అందాయి. దీంతో ప్యారీస్ ఒలింపిక్స్ 2024 నుంచి వెయిట్ లిఫ్టింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఐవోసి నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం పట్ల వెయిట్ లిఫ్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐడబ్ల్యూఎఫ్ కనుక సంస్కరణలు అమలు చేసి డోపీలపై కఠిన చర్యలు తీసుకుంటే 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో తిరిగి చేరుస్తామని ఐవోసీ చెప్పింది. ఐవోసీ ఎగ్జిక్యూటీవ్ బోర్డుకు ఈ నిర్ణయాధికారం ఉండటంతో వెయిట్ లిఫ్టింగ్‌ను సస్పెండ్ చేసింది.

    Neeraj Chopra: నీరజ్ చోప్రా స్వర్ణంపై హర్భజన్ సింగ్, గంభీర్ గొడవ.. సోషల్ మీడియాలో రచ్చ
     ఐవోసీ గవర్నింగ్ బాడీ ఈ నిర్ణయాన్ని తిరస్కరించినా.. అధ్యక్షుడు థామస్ బాచ్‌కు ఈ ప్రతిపాదనను అమలు చేసే అధికారం ఉన్నది. దీంతో వెయిట్ లిఫ్టింగ్‌ను 2024 ఒలింపిక్స్ నుంచి తొలగించడం ఖరారు అయిపోయింది. ఐవోసీ తీసుకున్న నిర్ణయం కారణంగా మీరాబాయ్ చానుతో పాటు అనేక మంది వెయిట్ లిఫ్టర్లు ప్యారీస్ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ సారి రజత పతకం నెగ్గిన చాను.. వచ్చే సారి గోల్డ్ కొట్టాలనే ఆశతో ఉన్నది. కానీ ఐవోసీ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. ఇది నిజంగా వెయిట్ లిఫ్టర్లకు రుచించని నిర్ణయం.
    Published by:John Naveen Kora
    First published: