హోమ్ /వార్తలు /క్రీడలు /

ఒక్కొక్కరికి 14.. ఆ క్రీడాకారులకు కండోమ్స్ ఇస్తున్న నిర్వాహకులు.. వాటినే మెడల్స్ అనుకోమని సలహా..!

ఒక్కొక్కరికి 14.. ఆ క్రీడాకారులకు కండోమ్స్ ఇస్తున్న నిర్వాహకులు.. వాటినే మెడల్స్ అనుకోమని సలహా..!

కండోమ్స్ ఫ్రీనే.. సెక్స్ మాత్రం చేయకండి..!

కండోమ్స్ ఫ్రీనే.. సెక్స్ మాత్రం చేయకండి..!

అన్ని లక్షల కండోమ్స్ ఫ్రీగా పంచి పెట్టినా.. సెక్స్ మాత్రం చేసుకోవద్దు అని ఐవోయే చెబుతున్నది. ప్లే బుక్‌లోని రూల్స్ అన్నీ పాటించండి.. ఆ కండోమ్స్ మాత్రం మీతో పాటు మీ దేశానికి తీసుకొని వెళ్లండి అని చెబుతున్నది.

ఒకటి కాదు రెండు కాదు.. ఒక్కొక్కరికి 14 కండోమ్స్ (Condoms) చొప్పున ఇవ్వడానికి దాదాపు 1 లక్షా 60 వేల కండోమ్స్ సిద్దం చేశారు. ఇంతకు అక్కడ ఏం జరుగుతున్నది? అంత మంది ఒకే చోటు గుమికూడి ఏం చేయబోతున్నారు? అంత భారీగా కండోమ్స్ పంపిణీ ఎవరు చేయబోతున్నారు? అనేగా మీ డౌటనుమానం. ఈ కండోమ్స్‌ను టోక్యో ఒలింపిక్స్‌కు (Tokyo Olympics) వచ్చే క్రీడాకారులకు (Athletes)నిర్వాహకులు పంచిపెట్టబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తుండటంతో 1988 సియోల్ ఒలంపిక్స్‌లో తొలి సారిగా అథ్లెట్లకు కండోమ్స్ పంపిణీ చేశారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతీ ఒలింపిక్స్‌లో అథ్లెట్లకు ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేయడం ఆనవాయితీగా మారింది. ఐదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో 4,50,000 కండోమ్స్ పంచిపెట్టారు. ఒక్కొక్క అథ్లెట్‌కు 42 కండోమ్స్ చొప్పున అందించారు. వీటిలో ఒక లక్ష కండోమ్స్ ఆడవాళ్లు ధరించే ఫీమేల్ కండోమ్స్ అంటా. 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్ సందర్భంగా కండోమ్స్ అయిపోవడంతో నిర్వాహకులపై ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పటికప్పుడు 20 వేల కండోమ్స్‌ను కొని తెప్పించి పంచి పెట్టారు.

ఒలింపిక్స్ కోసం 200పైగా దేశాల నుంచి వేలాది మంది అథ్లెట్లు వస్తారు. ఒలింపిక్ విలేజ్‌లో వీరందరూ బస చేస్తారు. ఒక అంచనా ప్రకారం ఒలింపిక్ విలేజ్‌లో ఉండే 70 శాతం మంది అథ్లెట్లు సెక్స్ చేస్తారని తెలిసింది. కొంత మంది అదే పని మీద ఉంటారని కూడా తోటి అథ్లెట్లు చెబుతున్నారు. అమెరికాకు చెందిన స్విమ్మర్ ర్యాన్ లోచే ఒలింపిక్స్ విలేజ్ గురించి అనేక ఆశ్చర్యకరమైన సంగతులు తెలిపారు. 'ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఉండే 70 నుంచి 75 శాతం అథ్లెట్లు సెక్స్ చేసుకుంటారు. ఓపెన్ ప్లేసులు, గడ్డిమీద, బిల్డింగ్స్ మధ్య ఉండే ఖాళీ స్థలాలు, బిల్డింగ్ పైన ఏదో ఒక ప్లేసులో దొర్లుతూ కనిపిస్తుంటారు. అంతెందుకు నా తోటి అమెరికన్ బీరక్స్ గ్రీర్ అయితే రోజుకు ముగ్గురు మహిళా అథ్లెట్లతో సెక్స్ చేయడం అలవాటు. 2000 సిడ్నీ గేమ్స్‌లో ఇలాగే చేసి మోకాలి గాయంతో అసలు జావెలిన్ త్రోలో పాల్గొనలేదు. అంత సెక్స్ పిచ్చి ఉన్నోళ్లు ఒలింపిక్స్‌కు వస్తారు' అని చెప్పుకొచ్చాడు. ఇక అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి హోప్ సోలో అయితే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తాము గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత ఒక సెలెబ్రిటీతో తన గదిలోనే సెక్స్ చేసినట్లు ఒప్పుకున్నది.


కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఐవోసీ లక్షా 60 వేల కండోమ్స్ పంపిణీ చేయడంతో పాటు 'ప్లే బుక్' రిలీజ్ చేసింది. కరోనా నేపథ్యంలో 33 పేజీల ప్లేబుక్‌లో  అనేక ఆంక్షలు పొందుపరిచింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే ప్రతీ క్రీడాకారుడు ఆ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించింది. అథ్లెట్లు మైదానంలోగానీ, క్రీడా గ్రామంలో గానీ కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని పేర్కొన్నారు. అలాగే కౌగిలించుకోవడం, కరచాలనం చేయడంపై నిషేధం విధించారు. ఒలింపిక్ విలేజ్ ఒక పెద్ద కంటైన్‌మెంట్ జోన్ కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ నిబంధనలు పాటించాలని నిర్వాహక కమిటీ హెచ్చరించింది.

ఇన్ని నిబంధనలు విధించి కండోమ్స్ ఎందుకు ఉచితంగా పంచుతున్నారని అథ్లెట్లు ప్రశ్నిస్తున్నారు. మా మీద ఏమైనా ప్రాక్టికల్ జోక్ వేస్తున్నారా అంటూ మండి పడ్డారు. దీనికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమాధానం ఇచ్చింది. 'ఆ కండోమ్స్ మీరు ఉపయోగించడానికి కాదు. ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికే. పతకాలు గెలవని వాళ్లు వాటినే ఒలింపిక్స్ మెడల్స్‌గా భావింవించి తమ దేశాలకు తిరిగి తీసుకొని వెళ్లండి. అక్కడి మీ ప్రజలకు కూడా అవగాహన కల్పించండి' అంటూ సమర్దించుకున్నది. కాగా, ఐవోయే సమాధానం విని అథ్లెట్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. కరోనా మహమ్మారి ఎంత ఉన్నా.. కండోమ్స్ ఉపయోగం మాత్రం ఒలింపిక్ విలేజ్‌లో ఆగకపోవచ్చని నిర్వాహక కమిటీ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.

First published:

Tags: Condoms, Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు