హోమ్ /వార్తలు /క్రీడలు /

Kasthuri : కేఎల్ రాహుల్ అండర్ వేర్ పై గృహలక్ష్మీ సీరియల్ తులసి అంత మాట అనేసిందేంటి?

Kasthuri : కేఎల్ రాహుల్ అండర్ వేర్ పై గృహలక్ష్మీ సీరియల్ తులసి అంత మాట అనేసిందేంటి?

KL Rahul - Kasthuri

KL Rahul - Kasthuri

Kasthuri : స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ లో కస్తూరి... తులసిగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సీరియల్ విషయానికి వస్తే కస్తూరిది అందులో మధ్య తరగతి గృహిణి పాత్ర.

ఇంటింటి గృహలక్ష్మి  సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగింటి ఇల్లాలు ఈ సీరియల్ కోసం ప్రతీ రోజు ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగ్‌లో కూడా దూసుకెళ్తుంది. ఇక ఈ సీరియల్‌లో మెయిన్ రోల్ చేస్తున్న నటి కస్తూరి (Kasthuri)గురించి కూడా మనకు తెలుసు... ఒకప్పుడు హీరోయిన్ అయిన కస్తూరి.. గృహలక్ష్మీ సీరియల్‌లో తులసి క్యారెక్టర్‌ చేస్తుంది. తులసి పాత్రలో కస్తూరి నటన అందర్నీ కట్టి పడేస్తోంది. కస్తూరి... తెలుగులో వచ్చిన అక్కినేని హీరో నాగార్జున నటించిన అన్నమయ్య లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. ఆ తర్వాత కూడా అనేక తమిళ సినిమాల్లో ఆడిపాడింది. కానీ ఈమెకు అవేవీ పనికిరాలేదనే చెప్పాలి. అందుకోసమే కస్తూరి ఇప్పుడు బుల్లితెర మీద తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఒకప్పుడు వెండి తెర మీద అందాల విందు చేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు బుల్లితెర మీద తన అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటుంది

నటితో పాటు సామాజిక కార్యకర్త అయిన కస్తూరి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రాజకీయ, సామాజిక సమస్యలపై తన గళం విప్పుతోంది. తాజాగా టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) అండర్ వేర్ పై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా అతడు ఓ ప్రముఖ బ్రాండ్ కు చెందిన అండర్ వేర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. సాధారణంగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత క్రికెటర్లు గానీ ఇలాంటి యాడ్స్ చేయడానికి ఇష్టపడరని.. కానీ రాహుల్ మాత్రం ధైర్యం చేసి ఈ యాడ్ చేశాడని తెలిపింది. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇది కూడా చదవండి : ధోనిపై FIR.. చెక్కు బౌన్స్ కేసులో ఇరుక్కున్న టీమిండియా కెప్టెన్..

కస్తూరి ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. " క్రికెటర్లు మాములుగా కోలాలు, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, ఇతర ప్రముఖ బ్రాండ్లకు ఎండార్స్ (ప్రచారం) చేయడమే చూశాం గానీ లో దుస్తులకు ప్రచారం చేయడానికి సిగ్గుపడుతుంటారు. కానీ రాహుల్ మాత్రం వాటిని ఎలాంటి బెరుకు లేకుండా ధరించాడు. రాహుల్ ను ఈ బాక్సర్లలో చూడటం చాలా బాగుంది. ఇది పురుషుల దుస్తులకు సంబంధించి వారి ఆలోచనల నుంచి బయటకు తీసుకువస్తుందని నమ్ముతున్నాను " అని రాసుకొచ్చింది. చివరగా ఇది ఫన్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ అని చివర్లో పేర్కొనింది.

కస్తూరి గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ లో కస్తూరి... తులసిగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సీరియల్ విషయానికి వస్తే కస్తూరిది అందులో మధ్య తరగతి గృహిణి పాత్ర. మధ్య తరగతి గృహిణిలా కస్తూరి చక్కగా ఒదిగిపోయింది. ఈ సీరియల్ కు రేటింగ్స్ కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సీరియల్ అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది.

First published:

Tags: Actress Kasthuri, Cricket, Intinti gruhalakshmi, KL Rahul, Tollywood news

ఉత్తమ కథలు