IPL 2021: వీళ్లు బ్యాటుతో రాణిస్తే.. ఆ జట్టు విజయానికి తిరుగుండదు.. ఎవరా బ్యాట్స్‌మెన్?

ఈ క్రికెటర్లు రాణిస్తే.. ఆ జట్టుకు విజయావకాశాలు పెరుగుతాయి.. (PC: RCB)

ఐపీఎల్‌లోని ప్రతీ జట్టులో కీలకమైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. వీళ్లు కనుక బ్యాటుతో రాణిస్తే ఆ జట్టు విజయావకాశాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అలాంటి బ్యాట్స్‌మెన్ ఎవరంటే...

  • Share this:
    కరోనా కారణంగా 29 మ్యాచ్‌ల తర్వాత అర్దాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 (IPL 2021) మరి కొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా తిరిగి ప్రారంభం కానున్నది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ముందు జరుగనున్న ఈ మెగా లీగ్ రెండో దశలో దాదాపు విదేశీ క్రికెటర్లు (Foreign Players) అందరూ పాల్గొంటున్నారు. వరల్డ్ కప్‌లో రాణించడానికి ఐపీఎల్ రెండో దశ చక్కగా ఉపయోగపడుతుదని.. ధనా ధన్ వరల్డ్ కప్‌కు ముందు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లభిస్తుందని క్రికెటర్లు భావిస్తున్నారు. దీంతో సెకెండ్ ఫేజ్ చాలా మజాగా ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఐపీఎల్‌ 2021లో 29 మ్యాచ్‌లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరి 10 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ 8 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నది. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం ఒకే విజయంతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్రతీ జట్టులో ప్రతీ సీజన్‌లో ఒకరిద్దరు ప్లేయర్లు క్రమం తప్పకుండా రాణిస్తున్నారు. వాళ్ల బ్యాటింగ్ ఫామ్ పైనే ఆయా జట్లు జయాపజయాలు ఆధారపడి ఉంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

    ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) విజయాల్లో ఏబీ డివిలియర్స్, ముంబై ఇండియన్స్‌కు (Mumbai Indians) కిరాన్ పొలార్డ్, పంజాబ్ కింగ్స్ విజయాల్లో క్రిస్ గేల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) విజయాల్లో డేవిడ్ వార్నర్ కీలకంగా ఉన్నారు. వీళ్లు బ్యాటుతో కనుక రాణిస్తే ఆయా జట్లు తప్పకుండా విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ గణాంకాలు పరిశీలిస్తే వారి ఫామ్ జట్టుకు ఎంత ముఖ్యమో తెలిసిపోతున్నది. సన్‌రైజర్స్ తరపున డేవిడ్ వార్నర్ ఫామ్‌లో ఉంటే సరిపోతుంది. సగం మ్యాచ్ భారాన్ని అతడే మోసేస్తుంటాడు. గతంలో అతడి ఫామ్ కారణంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు క్రమం తప్పకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకున్నది. ఈ ఏడాది వార్నర్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. దీంతో వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతూ వస్తున్నది. వార్నర్ ఫామ్‌లో లేకపోవడంతో ఈ సారి జట్టులో స్థానంతో పాటు కెప్టెన్సీని కూడా పోగొట్టుకున్నాడు. మరి మిగిలిన మ్యాచ్‌లలో ఏం చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతడు తిరిగి ఫామ్‌లోకి వస్తే సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి.

    ఈ ఆటగాళ్లు కూడా కీలకమే..

    కిరాన్ పొలార్డ్:

    10 పరుగుల లోపు చేస్తే జట్టు 41 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
    30+ పరుగులు చేస్తే జట్టు 75 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
    50+ పరుగులు చేసినప్పుడు 69 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.

    ఏబీ డివిలియర్స్:

    10 పరుగుల లోపు చేస్తే జట్టు 34 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
    30+ పరుగులు చేస్తే జట్టు 63 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
    50+ పరుగులు చేసినప్పుడు 67 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.

    సురేష్ రైనా:

    10 పరుగుల లోపు చేస్తే జట్టు 42 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
    30+ పరుగులు చేస్తే జట్టు 68 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
    50+ పరుగులు చేసినప్పుడు 63 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.

    డేవిడ్ వార్నర్:

    10 పరుగుల లోపు చేస్తే జట్టు 23 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
    30+ పరుగులు చేస్తే జట్టు 54 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
    50+ పరుగులు చేసినప్పుడు 65 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.

    క్రిస్ గేల్:

    10 పరుగుల లోపు చేస్తే జట్టు 29 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
    30+ పరుగులు చేస్తే జట్టు 64 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.
    50+ పరుగులు చేసినప్పుడు 65 శాతం మ్యాచ్‌లలో గెలిచింది.

    Kaun Banega Crorepati: కేబీసీలో పాల్గొన్న రైల్వే అధికారికి భారీ షాక్.. ఛార్జిషీట్ పంపిన రైల్వే శాఖ


     

    Published by:John Naveen Kora
    First published: