టెర్రర్ అలర్ట్.. టీమిండియాకు ఇంటలిజెన్స్ హెచ్చరిక..

IND Vs SA 1st test : విశాఖ తీరంలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. కోస్ట్‌గార్డ్,నేవీలతో మెరైన పోలీసులు సముద్రం నుంచి వచ్చే నౌకలు,బోట్లపై నిఘా పెట్టారు.

news18-telugu
Updated: October 6, 2019, 1:11 PM IST
టెర్రర్ అలర్ట్.. టీమిండియాకు ఇంటలిజెన్స్ హెచ్చరిక..
టీమిండియా
  • Share this:
ఉగ్రవాదులు క్రికెటర్లను టార్గెట్ చేయవచ్చునన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.ఈ నేపథ్యంలో టీమిండియా,దక్షిణాఫ్రికా క్రికెటర్ల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.విశాఖలో క్రికెటర్లు బస చేస్తున్న హోటల్.. అలాగే మైదానం వద్ద భద్రతను పెంచారు. విశాఖ తీరంలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. కోస్ట్‌గార్డ్,నేవీలతో మెరైన పోలీసులు సముద్రం నుంచి వచ్చే నౌకలు,బోట్లపై నిఘా పెట్టారు.ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. జడేజా 4 వికెట్లు, షమీ 3 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 149/8 ఉంది.దక్షిణాఫ్రికా విజయానికి 246 పరుగులు కావాలి. చేతిలో రెండు వికెట్లతో దక్షిణాఫ్రికా టార్గెట్‌ను చేధించడం కష్టమనే చెప్పాలి. దీంతో టీమిండియా విజయం దాదాపుగా ఖాయమైనట్టుగానే కనిపిస్తోంది.
Published by: Srinivas Mittapalli
First published: October 6, 2019, 1:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading