Home /News /sports /

INJURED CONWAY TURNS MENTOR HELPS REPLACEMENT TIM SEIFERT IN PRACTICE CHECK VIDEO JNK

T20 World Cup: ఫైనల్ మ్యాచ్‌కు దూరమైన డెవాన్ కాన్వే ఏం చేస్తున్నాడో తెలుసా? కివీస్ ప్రాక్టీస్ చేస్తుంటే..

చేతికి కట్టుతో ప్రాక్టీస్ సెషన్‌లో డెవాన్ కాన్వే

చేతికి కట్టుతో ప్రాక్టీస్ సెషన్‌లో డెవాన్ కాన్వే

    టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఫైనల్ ఆస్ట్రేలియా (Australia) - న్యూజీలాండ్ (New Zealand) జట్ల మధ్య ఆదివారం జరుగనున్నది. ఇరు జట్లు తొలి సారి వరల్డ్ కప్ గెలవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే కివీస్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే (Devon Conway) చేతి గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. అయితే చేతికి కట్టు కట్టుకున్న కాన్వే.. శనివారం న్యూజీలాండ్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యాడు. మైదానంలో కివీస్ ఆటగాళ్లు చేస్తున్న ప్రాక్టీస్‌ను పర్యవేక్షించాడు. ఫైనల్‌లో కాన్వే బదులు బరిలోకి దిగుతాడని భావిస్తున్న టిమ్ సీఫెర్ట్‌కు సలహాలు సూచనలు ఇస్తూ కాసేపు మెంటార్‌గా మారాడు. స్పెషలిస్టు కీపర్ అయిన సీఫెర్ట్‌కు ఎడమ చేతితో బంతులు విసురుతూ ప్రాక్టీస్ చేయించాడు. ఈ రోజు మ్యాచ్‌లో డెవాన్ కాన్వే బదులు సీఫెర్ట్‌కు జట్టులో చోటు లభించే అవకాశం ఉన్నది.

    ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ సందర్భంగా డెవాన్ కాన్వే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కివీస్ జట్టు డారిల్ మిచెల్‌తో కలసి కాపాడాడు. అయితే కీలకమైన సమయంలో కాన్వే అవుట్ అయ్యాడు. దాంతో అసహనంతో కాన్వే చేతిని బ్యాటుకేసి బాదుకోవడమే కాకుండా.. బ్యాటును బలంగా విసిరేశాడు. దీంతో కాన్వే కుడి చేతికి గాయమైంది. వెంటనే అతడికి స్కానింగ్ చేయించగా.. చేతి వేలు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో కాన్వే టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు మాత్రమే కాకుండా.. ఆ తర్వాత జరగబోయే ఇండియా పర్యటనకు కూడా దూరమయ్యాడు.





    డెవాన్ కాన్వే అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో డారిల్ మిచెల్‌ను ఇండియా పర్యటనకు ఎంపిక చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో మిచెల్ 72 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. బలమైన ఇంగ్లాండ్‌పై పూర్తి ఎటాకింగ్ క్రికెట్ ఆడి న్యూజీలాండ్‌ను తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చాడు. దీంతో అతడిని ఇండియాతో జరగబోయే టూర్‌కు ఎంపిక చేశారు.

    IAS Cricketer: ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసి.. టీమ్ ఇండియా తరపున క్రికెట్ ఆడాడు.. అతడెవరో తెలుసా? ఇప్పుడేం చేస్తున్నాడు?




    ఇక ఈ రోజు సాయంత్రం ఆస్ట్రేలియా - న్యూజీలాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి ఉన్నది. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారనున్నది. దుబాయ్‌లో టాస్ గెలిచిన జట్లు ముందుగా ఫీల్డింగ్ చేసి మ్యాచ్‌లు గెలిచాయి. రాత్రి పూట మంచు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్లే ఛేదన చేసే జట్టును వరంగా మారుతున్నది.

    తుది జట్ల అంచనా..

    ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అడమ్ జంపా, జోష్ హాజెల్‌వుడ్

    న్యూజీలాండ్: మార్టిన్ గుప్తిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్‌సన్ (కెప్టెన్), టిమ్ సిఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, అడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోథి, ట్రెంట్ బౌల్ట్
    Published by:John Naveen Kora
    First published:

    Tags: T20 World Cup 2021

    తదుపరి వార్తలు