Home /News /sports /

INDW VS AUSW AUSTRALIA WOMEN HAVE WON THE TOSS AND HAVE OPTED FIELD FIRST AND HERE THE BOTH TEAMS DETAILS SRD

INDW Vs AUSW : పింక్ టెస్ట్ కు భారత అమ్మాయిలు రెడీ.. టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లు ఇవే..

INDW Vs AUSW

INDW Vs AUSW

INDW Vs AUSW : భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతోంది. తమ తొలి పింక్ టెస్ట్ కు(Ind W Vs Aus W Pink Ball Test) సై అంటోంది.

    భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతోంది. తమ తొలి పింక్ టెస్ట్ కు(Ind W Vs Aus W Pink Ball Test) సై అంటోంది. ఆస్ట్రేలియాతో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే నాలుగు రోజుల టెస్టు నేటి నుంచి జరగనుంది. మిథాలీ రాజ్‌ బృందానికి డే–నైట్‌ టెస్టు కొత్తనుకుంటే... ఆసీస్‌తో ఆడటం కూడా ఒక రకంగా కొత్తే! ఎందు కంటే ఇరు జట్ల మధ్య సంప్రదాయ మ్యాచ్‌ జరిగి దశాబ్దంన్నరకాలం అవుతోంది. భారత జట్టు మొదటిసారిగా పింక్ బాల్‌తో ఆడుతోంది. కాబట్టి ప్రకాశవంతమైన పింక్ బంతి ప్రభావం ఏమిటో, ఎలా ఉంటుందో ఆటగాళ్లకు తెలియదు. ఆస్ట్రేలియా నవంబర్ 2017 లో ఏకైక డే-నైట్ టెస్ట్ ఆడింది. ఇక, ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా తరుఫున నలుగురు కొత్త ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. భారత్ తరఫున యాష్తికా బాటియా, మేఘనా సింగ్ తొలి టెస్ట్ ఆడబోతున్నారు.

    ఇక, ఆఖరిసారిగా 2006లో ఇరు జట్లు టెస్టులో తలబడ్డాయి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ముఖాముఖీ టెస్టు పోరుకు ఇప్పుడు సిద్ధమయ్యాయి. మిథాలీ రాజ్, వెటరన్‌ సీమర్‌ జులన్‌ గోస్వామి అప్పటి మ్యాచ్‌ ఆడారు. ఇప్పుడు వీళ్లిద్దరితో ఆడుతున్న వాళ్లంతా కొత్తవాళ్లే! ఇక మ్యాచ్‌ విషయానికొస్తే భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో టెస్టు.

    ఇటీవల ఇంగ్లండ్‌ గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో మిథాలీ సేన చక్కని పోరాటస్ఫూర్తి కనబరిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా 2019లో యాషెస్‌ సిరీస్‌ ఆడాక మళ్లీ టెస్టులే ఆడలేదు. ఈ నేపథ్యంలో భారత అమ్మాయిలకు ఇంగ్లండ్‌తో టెస్టు అనుభవం పైచేయి సాధించేందుకు దోహదం చేయొచ్చు.


    తుది జట్లు :

    భారత్ : స్మృతి మంధన, షెఫాలీ వర్మ, పునమ్ రౌత్, మిథాలీ రాజ్(కెప్టెన్), యాష్తికా భాటియా, దీప్తి శర్మ, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, జులన్ గో స్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

    ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఎలీసా పెర్రీ, తహిలా మెక్ గ్రాత్, యాష్లే గార్డెనర్, అనాబెల్ సదర్ ల్యాండ్, సోఫీ మెలినిక్స్, జార్జియా వర్హెమ్, డార్సీ బ్రౌన్, స్టెల్లా క్యాంప్ బెల్

    హెడ్ టు హెడ్ రికార్డులు : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 9 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 5 టెస్టుల్లో గెలుపొందగా, నాలుగు ‘డ్రా’గా ముగిశాయి. భారత్‌ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని మిథాలీ సేన భావిస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: India vs australia, Mithali Raj, Smriti Mandhana, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు