సైనా నెహ్వాల్ లాస్ట్ పంచ్ ఖరీదు రూ.2.50కోట్లు.. కొడుతుందా?

హైదరాబాదీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఇండొనేసియా మాస్టర్స్ టోర్నీ ఫైనల్‌కు చేరింది. ఫైనల్స్‌లో గెలిస్తే ఆమెకు రూ.2.50కోట్ల ప్రైజ్ మనీ వస్తుంది.

news18-telugu
Updated: January 26, 2019, 10:59 PM IST
సైనా నెహ్వాల్ లాస్ట్ పంచ్ ఖరీదు రూ.2.50కోట్లు.. కొడుతుందా?
సైనా నెహ్వాల్
  • Share this:
ఒకే ఒక్క లాస్ట్ పంచ్. దాన్ని ఫినిష్ చేస్తే చాలు సైనా నెహ్వాల్ ఖాతాలో రూ.2.50 కోట్లు పడతాయి. ఇండొనేసియా మాస్టర్స్ టోర్నీలో హైదరాబాదీ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఫైనల్స్‌కు చేరింది. సెమీ ఫైనల్స్‌లో అత్యంత శ్రమకోర్చి గెలిచింది. గత ఏడాది ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో వెండి పతకం సాధించిన, ఆరో సీడ్ బింగ్ జియావో మీద 18-21 21-12 21-18 తేడాతో విజయం సాధించింది.

Saina-Kashayap
సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ( Saina nehwal / twitter )


ఇండొనేసియా మాస్టర్స్ టోర్నీలో గెలవాలంటే ఫైనల్లో గట్టి పోటీ తప్పదు. మూడు సార్లు వరల్డ్ ఛాంపియన్, ఒలింపిక్ ఛాంపియన్ అయిన స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్‌ లేదా చైనాకు చెందిన మూడో సీడ్ క్రీడాకారిణి చెన్ యూఫై కానీ ఫైనల్స్‌లో సైనాతో తలపడతారు.

Saina Nehwal PV Sindhu, Saina Nehwal Earnings, Highest Earning Badminton Players, Saina Nehwal marriage with Kashyap, Saina Nehwal Marriage Date, Saina Nehwal Hobbies, సైనా నెహ్వాల్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ సంపాదన, సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ పెళ్లి డేట్, సైనా నెహ్వాల్ పీవీ సింధు రికార్డులు, Saina Nehwal in Syed modi International Trophy 2018
సైనా నెహ్వాల్


గత ఏడాది ఇండొనేసియా మాస్టర్స్‌లో ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోయింది సైనా నెహ్వాల్. 2018లో కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆసియా గేమ్స్‌లో వెండి పతకం సాధించింది. డెన్మార్క్, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో ఫైనల్స్ వరకు వెళ్లింది.
First published: January 26, 2019, 10:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading