ఒకే ఒక్క లాస్ట్ పంచ్. దాన్ని ఫినిష్ చేస్తే చాలు సైనా నెహ్వాల్ ఖాతాలో రూ.2.50 కోట్లు పడతాయి. ఇండొనేసియా మాస్టర్స్ టోర్నీలో హైదరాబాదీ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఫైనల్స్‌కు చేరింది. సెమీ ఫైనల్స్‌లో అత్యంత శ్రమకోర్చి గెలిచింది. గత ఏడాది ప్రపంచ ఛాంపియన్ షిప్లో వెండి పతకం సాధించిన, ఆరో సీడ్ బింగ్ జియావో మీద 18-21 21-12 21-18 తేడాతో విజయం సాధించింది.

సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ( Saina nehwal / twitter )
ఇండొనేసియా మాస్టర్స్ టోర్నీలో గెలవాలంటే ఫైనల్లో గట్టి పోటీ తప్పదు. మూడు సార్లు వరల్డ్ ఛాంపియన్, ఒలింపిక్ ఛాంపియన్ అయిన స్పెయిన్ బ్యాడ్మింటన్ స్టార్ కరోలినా మారిన్ లేదా చైనాకు చెందిన మూడో సీడ్ క్రీడాకారిణి చెన్ యూఫై కానీ ఫైనల్స్‌లో సైనాతో తలపడతారు.

సైనా నెహ్వాల్
గత ఏడాది ఇండొనేసియా మాస్టర్స్‌లో ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోయింది సైనా నెహ్వాల్. 2018లో కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆసియా గేమ్స్‌లో వెండి పతకం సాధించింది. డెన్మార్క్, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో ఫైనల్స్ వరకు వెళ్లింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 26, 2019, 22:59 IST