సైనా నెహ్వాల్‌కు కలిసొచ్చిన కొత్త ఏడాది... ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్‌ కైవసం...

సైనా నెహ్వాల్ ఖాతాలో మూడో ఇండోనేషియా టైటిల్... గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగిన కరోలినా మారిన్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 27, 2019, 5:08 PM IST
సైనా నెహ్వాల్‌కు కలిసొచ్చిన కొత్త ఏడాది... ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్‌ కైవసం...
సైనా నెహ్వాల్
  • Share this:
ఇండోనేషియా మాస్టర్స్ ఫైనల్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సంచలనం క్రియేట్ చేసింది. పెళ్లైన తర్వాత జోరు పెంచి, మలేషియా ఓపెన్స్ టోర్నీలో సెమీస్ చేరిన ఈ చిన్నది... ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ ఖాతాలో వేసుకుని శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన ఇండినేషియా మాస్టర్స్ వుమెన్ సింగిల్స్ ఫైనల్‌లో స్పెయిన్ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఐదో సీడ్ కరోలినా మారిన్ గాయం కారణంగా మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌ సైనాను విజేతగా ప్రకటించారు నిర్వాహకులు.

మలేషియా ఓపెన్స్‌లో భారత క్రీడాకారిణిని ఓడించిన కరోలినా మారిన్... ఈ మ్యాచ్‌లోనూ మంచి ఆధిపత్యం కనబర్చింది. ఆట ప్రారంభంలో 3-0 తేడాతో మంచి ఆధిక్యం కనబర్చింది. కరోలినా మారిన్ దూకుడు ముందు నిలబడలేకపోయిన సైనా నెహ్వాల్... 10-3 తేడాతో మొదటి సెట్‌లో బాగా వెనకబడింది. ఈ దశలో సైనా సంధించిన ఓ షాట్‌ను ఆడబోయిన కరోలినా మారిన్... కోర్టులో కిందపడిపోయింది. మడమ బెనకడంతో నొప్పితో మ్యాచ్ కొనసాగించలేనని తేల్చేశారు. దీంతో భారత స్టార్ ప్లేయర్‌ను విజేతగా ప్రకటించారు. గత ఏడాది ఇండోనేషియా ఓపెన్ టోర్నీ ఫైనల్ చేరుకున్న సైనా నెహ్వాల్‌కు ఇది మూడో టైటిల్. 2009లో మొదటి టోర్నీ గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది సైనా.


First published: January 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>