ఇండోనేసియా ఓపన్ విజేత సైనా నెహ్వాల్‌...కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్

Indonesia Masters 2019 | గతంలో 2009, 2010, 2012లో ఇండోనేసియా ఓపన్ టైటిల్‌ను సైనా గెలుచుకుంది. ఇప్పుడు నాలుగోసారి ఇండోనేసియా ఓపన్ టైటిల్‌ను గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ సైనా ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: January 28, 2019, 12:04 PM IST
ఇండోనేసియా ఓపన్ విజేత సైనా నెహ్వాల్‌...కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్
సైనా నెహ్వాల్
  • Share this:
హైదరాబాదీ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ మెరిసింది. తాజాగా ఇండోనేసియా ఓపన్ టైటిల్ గెలుచుకుంది. ఆదివారంనాటి ఫైనల్లో ప్రత్యర్థి కరోలినా మారిన(స్పెయిన్) కాలి గాయంతో ఆట నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో టైటిల్‌ను సైనా నెహ్వాల్ సొంతం చేసుకుంది. ఇండోనేసియా ఓపన్‌ టైటిల్‌ను సైనా నెహ్వాల్ గెలుచుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 2009, 2010, 2012లోనూ సైనా గెలుచుకుంది. ఇప్పుడు నాలుగోసారి ఇండోనేసియా ఓపన్ టైటిల్‌ను గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తంచేస్తూ సైనా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...ట్విట్టర్ ద్వారా సైనాకు కంగ్రాట్స్ చెప్పారు.First published: January 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు