• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • INDIAS TOP BADMINTON PLAYER KIDAMBI SRIKANTH FIRES THAILAND OPEN ORGANISERS FOR UNPLEASANT COVID TESTS IN TWITTER AND SHARES PICS SRD

Kidambi Srikanth : మీ టెస్ట్ లు తగలయ్యా.. ముక్కులో నుంచి రక్తం..కిడాంబి శ్రీకాంత్ షాకింగ్ పోస్ట్

Kidambi Srikanth

Kidambi Srikanth : థాయిలాండ్ ఓపెన్ కోసం బ్యాంకాక్ చేరిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయ్. ఇప్పటికే టాప్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కరోనా బారిన పడి టోర్నీ నుంచి వైదొలిగింది.

  • Share this:
    థాయిలాండ్ ఓపెన్ కోసం బ్యాంకాక్ చేరిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయ్. ఇప్పటికే టాప్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కరోనా బారిన పడి టోర్నీ నుంచి వైదొలిగింది. సైనాతో పాటు యువ షట్లర్ ప్రణయ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. దీంతో టీమండియా శిబిరంలో ఆందోళన మొదలైంది. సైనాకు పాజిటివ్ రావడంతో ఆమె కు క్లోజ్ గా ఉన్న సింధూ ఆందోళన చెందుతోంది. అయితే, కరోనా పరీక్షల కోసం థాయిలాండ్ ఓపెన్ నిర్వాహకులు అత్సుత్సాహం చూపిస్తున్నారు. మిగతా ప్లేయర్స్ భద్రత కోసం టెస్ట్ లు నిర్వహించడంలో తప్పులేదు కానీ.. కనీస ప్రమాణాలు పాటించుకుండా ఎలా పడితే అలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. లేటెస్ట్ గా భారత టాప్ ప్లేయర్ తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ సంచలన పోస్ట్ చేశాడు. " మ్యాచ్‌కి ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ నాకు ఇలా రక్తస్రావమైంది. నేను ఇప్పటికే నాలుగు సార్లు పరీక్షలు చేయించుకున్నాను. దేనిలోనూ పాజిటివ్ రాలేదు. ఇలా టెస్ట్ లు నిర్వహించడం ఎంత మాత్రం ఆమోదం కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రక్తం కారుతున్న ఫోటోను షేర్ చేశాడు శ్రీకాంత్.

    గుంటూరులో జన్మించిన శ్రీకాంత్... కామన్వెల్‌ గేమ్స్ లో మిక్స్‌డ్ టీమ్ తరుపున గోల్డ్, మెన్స్ సింగిల్స్‌లో సిల్వర్ పతకాన్ని సాధించాడు. పద్మశ్రీ, అర్జున అవార్డులు కూడా అందుకున్నాడు.అనేక అద్భుత విజయాలతో మెన్స్ సింగిల్స్‌లో టాప్ ర్యాంకు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు శ్రీకాంత్. కరోనా కారణంగా వాయిదాపడ్డ థాయిలాండ్ ఓపెన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, అంపైర్లు, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, వైద్య సిబ్బంది, టీవీ ప్రొడక్షన్ సిబ్బంది,లైన్ జడ్జీలతో సహా 824 మందికి కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ టెస్ట్‌ల్లో ఇద్దరూ భారత షట్లర్‌కు కరోనా సోకింది.


    ముందు జాగ్రత్తగా ప్లేయర్లకు మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించారు థాయ్‌లాండ్ ఓపెన్ నిర్వహించారు. మొదటి రెండుసార్లు సైనాకి నెగిటివ్ రాగా మూడోసారి పాజిటివ్ వచ్చింది. తన రిపోర్టు ఇంకా చేతికి రాలేదని, మ్యాచ్ ఆరంభానికి ముందు వామప్ చేస్తుంటే కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి, తనను ఆసుపత్రి తీసుకెళ్లారని తెలిపింది.
    Published by:Sridhar Reddy
    First published: