ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టను బీసీసీఐ ప్రకటించింది. ఈసారి జట్టులోకి ముగ్గురు యువకులను తీసుకుంది. ఐపీఎల్లో దుమ్మురేపి, తాజాగా మంచి పెర్ఫార్మెన్స్ చూపుతున్న ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియాతో వన్డేల్లో డ్రాప్ అయిన రిషబ్ పంత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. పేటీఎం టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు విరాట్ కోహ్లీ (కెప్టెన్) రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్) యజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్సర్ పటేల్, వాషింగ్లన్ సుందర్, రాహుల్ తెవాటియా, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవ్ దీప్, శార్ధూల్ ఠాకూర్.
జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఈ రోజే భారీ ఇన్నింగ్స్ ఆడాడు. మరి నేషనల్ టీమ్‌కు సెలక్ట్ చేయడం లేదన్న కసిమీద ఉన్నాడో ఏమో కానీ.. విజయ్ హజారే వన్డే టోర్నీలో తొలిరోజు బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడాడు. 94 బంతుల్లో 173 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ప్రభావం బాగా పనిచేసినట్టుంది. అతడికి తొలిసారి జట్టులోకి పిలుపు వచ్చింది. ఇక రాహుల్ తెవాటియా కూడా ఇటీవల ఐపీఎల్లో మంచి ప్రతిభ చూపాడు. అసలు ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు గెలిపించాడు. దీంతో అతడికి కూడా తొలిసారి పిలుపు వచ్చింది.
ఇక గతంలో ఆస్ట్రేలియా జట్టుకు తొలిసారి ఎంపికైనా చివరి నిమిషంలో భుజం నొప్పి కారణంగా ఆడలేకపోయిన వరుణ్ చక్రవర్తికి కూడా మరోసారి అవకాశం కల్పించింది బీసీసీఐ.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.