ఏషియాడ్ : 11 రోజుల్లో భారత్ ఖాతాలో 11 పసిడి పతకాలు

18 ఏషియాడ్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాల పంట పండింది.అథ్లెటిక్స్‌లోని  వివిధ విభాగాల నుంచి 5 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. రెజర్లు,షూటర్లు రెండేసి స్వర్ణాలు అందించగా..రోయింగ్ ,టెన్నిస్ ఈవెంట్స్ నుంచి ఒక్కో పతకం ఇండియా ఖాతాలో చేరాయి.

news18-telugu
Updated: August 31, 2018, 11:31 AM IST
ఏషియాడ్ : 11 రోజుల్లో భారత్ ఖాతాలో 11 పసిడి పతకాలు
వినేష్ ఫోగట్,నీరజ్ చోప్రా (Teamindia/Twitter)
  • Share this:
2018 ఆసియా గేమ్స్‌‌లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత్..తొలి రోజు నుంచే బంగారు పతకాల వేట ఆరంభించింది. ప్రస్తుత ఏషియాడ్ 11 రోజుల పోటీల్లో ఇండియా ఖాతాలో 11 పసిడి పతకాలు చేరాయి. భారత్‌కు అథ్లెటిక్స్‌లో బంగారు పతకాల పంట పండింది. అథ్లెటిక్స్‌ నుంచే 5 గోల్డ్ మెడల్స్ భారత్ ఖాతాలో చేరాయి. రెజర్లు,షూటర్లు రెండేసి పతకాలు అందించగా..రోయింగ్ ,టెన్నిస్ ఈవెంట్స్ నుంచి ఒక్కో పతకం ఇండియా ఖాతాలో చేరాయి.పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన బజ్‌రంగ్‌ పూనియా ప్రస్తుత ఏషియాడ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం అందించాడు. బజ్‌రంగ్ తర్వాత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ భారత్‌కు రెండో పతకం అందించింది. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. 2018 ఏషియాడ్‌లో పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా మాత్రమే కాదు రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ ట్రాక్ రికార్డ్‌లో గోల్డ్ మెడల్ నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా అరుదైన ఘనతను  సొంతం చేసుకుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ నుంచి మూడు స్వర్ణాలు, షాట్ పుట్,జావెలిన్ త్రో ఈవెంట్స్ నుంచి రెండు పతకాలు వచ్చాయి. రోయింగ్, టెన్నిస్ మెన్స్ డబుల్స్‌,షూటింగ్,విభాగాల్లో భారత్‌కు అనూహ్యంగా స్వర్ణాలు రావడం విశేషం.
భారత బంగారు పతక విజేతలు :

మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో రాహి సర్నోబత్‌,10 మీ ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో 16 ఏళ్ల సౌరభ్ చౌదరి స్వర్ణాలు నెగ్గి చరిత్రను తిరగరాశారు.మెన్స్ క్వాడ్రాపుల్ స్కల్స్ రోయింగ్‌లో దత్తు బాబన్,ఓమ్ ప్రకాష్,సుఖ్‌మీత్ సింగ్,సవర్ణ్ సింగ్‌ గోల్డ్ మెడల్‌ సాధించి దేశానికే గర్వ కారణంగా నిలిచారు.11వ రోజు మహిళల హెప్టాథ్లాన్‌లో స్నప్న బర్మన్,పురుషుల ట్రిపుల్ జంప్‌లో అర్పీందర్ సింగ్ పసిడి పతకాలు నెగ్గి యావత్ భారతాన్ని ఆశ్చర్యపరచారు.

ఇవి కూడా చదవండి:

బ్రాంజ్ మెడలిస్ట్ సైనా‌ నెహ్వాల్‌కు 'గోల్డెన్' గిఫ్ట్

PICS: తండ్రి ఇచ్చిన గిఫ్ట్‌తో సంబరపడిపోతున్న సైనా నెహ్వాల్
First published: August 30, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు