హోమ్ /వార్తలు /క్రీడలు /

Priya Malik Gold : రెజ్లింగ్ లో భారత్ సంచలనం..గోల్డ్ మెడల్ తో సత్తా చాటిన ప్రియా మాలిక్ ..

Priya Malik Gold : రెజ్లింగ్ లో భారత్ సంచలనం..గోల్డ్ మెడల్ తో సత్తా చాటిన ప్రియా మాలిక్ ..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Priya Malik Gold : అంతర్జాతీయ యవ్వనిక పై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. మన అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో

ఇంకా చదవండి ...

అంతర్జాతీయ యవ్వనికపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. మన అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను (Mirabai Chanu) రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది. భారత రెజ్లర్ ప్రియా మాలిక్ (Priya Malik) సంచలనం సృష్టించింది. వరల్డ్ రెజ్లింగ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతున్న ఈ రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి ప్రియా మాలిక్ పసిడి కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ చాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడా వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం విశేషం. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగట్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.

మరోవైపు ప్రియా మాలిక్ గోల్డ్ సాధించడంతో వెస్ట్ బెంగాల్ సీఎం అభినందించారు. అంతర్జాతీయ యవ్వనిక ఇలాగే మన అథ్లెట్లు సత్తా చాటాలని ఆమె కోరుకున్నారు. అలాగే, భవిష్యత్తులో ప్రియా మాలిక్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మమతా బెనర్జీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు ప్రియా మాలిక్ ను అభినందించారు.

ఇక, టోక్యో ఒలింపిక్స్ లో కూడా మన మహిళా అథ్లెట్లు దూసుకుపోతున్నారు. ఈ రోజు జరిగిన పోటీల్లో మన స్టార్ ప్లేయర్స్ మేరీ కోమ్, పీవీ సింధు గెలిచి ముందుడుగు వేశారు. మనికా బాత్రా కూడా టేబుల్ టెన్నిస్ లో మెరిసింది. ఈ ముగ్గురు ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే మన పతకాల కౌంట్ పెరగడం గ్యారెంటీ అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.

First published:

Tags: Sports, Tokyo Olympics, Wrestling

ఉత్తమ కథలు