హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: రెజ్లింగ్‌లో అదరగొట్టిన రవి, దీపక్... సెమీస్ చేరిన భారత కుస్తీ వీరులు

Tokyo Olympics: రెజ్లింగ్‌లో అదరగొట్టిన రవి, దీపక్... సెమీస్ చేరిన భారత కుస్తీ వీరులు

రెజ్లింగ్‌లో సెమీస్ చేరిన దీపక్ పునియా, రవి దహియా

రెజ్లింగ్‌లో సెమీస్ చేరిన దీపక్ పునియా, రవి దహియా

రెజ్లింగ్‌లో సెమీస్ చేరిన దీపక్ పునియా, రవి దహియా

    టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత కుస్తీవీరులు (Indian Wrestler) అదరగొట్టారు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో (Quarter Finals) భారత రెజ్లర్లు శుభారంభం చేశారు. పురుషుల విభాగంలో రవి దహియా (Ravi Dahiya), దీపక్ పునియా (Deepak Punia) విజయాలు సాధించగా.. మహిళల విభాగంలో అన్షు మాలిక్ (Anshu Malik) నిరాశ పరిచినా.. మరో ఛాన్స్ ఉన్నది. రవి దహియా క్వార్టర్ ఫైనల్‌లో జార్జి వలెటినోవ్‌ను 14-4 తేడాతో విజయం సాధించి సెమీస్ చేరాడు. ఇక దీపక్ పునియా చైనాకు చెందిన లిన్ జుషెన్‌పై 6-3 తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్ చేరాడు. ఇక అన్షు మాలిక్ తొలి రౌండ్‌లో ఇర్యానా కురచికినాపై ఓడిపోయింది. అయితే ఇర్యానా కురచికినా సెమీస్ చేరడంతో రిపిచేజ్ రూల్ కారణంగా మూడో స్థానం కోసం పోరాడే అవకాశం వచ్చింది.

    First published:

    Tags: Olympics, Tokyo Olympics, Wrestling

    ఉత్తమ కథలు