భారత రెజ్లర్ భజరంగ్ పునియా(Bajrang Punia) టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) 2020లో క్వార్టర్ ఫైనల్ చేరాడు. శుక్రవారం ఉదయం 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో కిర్గిస్తాన్‌కు చెందిన ఎర్నజర్ అక్మటాలెవ్‌తో జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్‌లో పునియా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఒలింపిక్స్‌లో తప్పక పతకం తెస్తాడని భజరంగ్ పునియాపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చాంపియన్ ప్రదర్శన చేశాడు. తొలి రౌండ్‌లో భజరంగ్ ముందే పాయింట్ సాధించాడు. ఏకంగా 3-1 ఆధిక్యంతో దూసుకొని వెళ్లాడు. ఆ తర్వాత రౌండ్లో కిర్గిస్తాన్ రెజ్లర్ గట్టి పోరాటం చేశాడు. ఒక్కో పాయింట్ సాధిస్తూ చివరకు 3-3తో స్కోర్ సమం చేశాడు. అయితే రిఫరీలు పునియాను విజేతగా ప్రకటించాడు. స్కోరింగ్ మూవ్స్ ఎక్కువగా పునియా చేయడంతో అతడిని విజయం వరించింది. కిర్గిస్తాన్ రెజ్లర్ స్కోరింగ్ మూవ్స్ కంటే పునియాను రింగ్ నుంచి బయటకు నెట్టేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో రిఫరీలు పునియానే విజేతగా ప్రకటించారు.
#IND@BajrangPunia makes a winning start to his #Olympics campaign as he beats Ernazar Akmatalaiev of #KGZ Winning by Points
ఇక క్వార్టర్ ఫైనల్‌లో పునియా ఇరాన్‌కు చెందిన రెజ్లర్‌తో తలపడనున్నాడు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.