ఏషియాడ్ : స్క్వాష్ ఉమెన్స్ టీమ్‌ 'సిల్వర్‌'తోనే సరిపెట్టుకుంది

2014 ఇంచియాన్ ఆసియా గేమ్స్‌లో సిల్వర్ మెడల్ నెగ్గిన ఇండియన్ ఉమెన్స్ టీమ్ మరోసారి రజత పతకానికే పరిమితమైంది.

news18-telugu
Updated: September 1, 2018, 5:45 PM IST
ఏషియాడ్ : స్క్వాష్ ఉమెన్స్ టీమ్‌ 'సిల్వర్‌'తోనే సరిపెట్టుకుంది
భారత స్క్వాష్ ఉమెన్స్ టీమ్‌కు సిల్వర్ మెడల్ (Rajyavardhan Rathore/Twitter)
  • Share this:
18వ ఏషియాడ్ స్క్వాష్‌ ఈవెంట్లలో భారత్‌కు పతకాల పంట పండింది.స్క్వాష్ టీమ్ ఈవెంట్‌లో దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప, సునైనా కుర్విల్లా, తన్వీ ఖన్నాలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకం సొంతం చేసుకుంది.హాంకాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో ఓడిన ఇండియన్ ఉమెన్స్ టీమ్ సిల్వర్ మెడల్‌తోనే సరిపెట్టుకుంది. సెమీఫైనల్‌లో మలేసియాను ఓడించి ఎన్నో అంచనాల మధ్య ఫైనల్‌లో బరిలోకి దిగిన భారత టీమ్ స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమైంది.0-2తో హాంకాంగ్ చేతిలో మహిళల టీమ్ ఈవెంట్‌లో రన్నరప్ స్థానానికే పరిమితమైంది. గ్రూప్ దశలోనూ  భారత జట్టు హాంకాంగ్‌ జట్టు చేతిలోనే ఓడింది.2014 ఇంచియాన్ ఆసియా గేమ్స్‌లోనూ సిల్వర్ మెడల్ నెగ్గిన ఇండియన్ ఉమెన్స్ టీమ్ మరోసారి అదే పతకం సాధించగలిగింది.
ఈ రజతంతో మెడల్స్ టేబు‌ల్‌లో భారత పతకాల సంఖ్య 68కి చేరుకుంది.ఓవరాల్‌గా ఇది 24వ సిల్వర్ మెడల్.ప్రస్తుత ఆసియా గేమ్స్‌లో స్క్వాష్‌ ఈవెంట్లలో భారత్‌కు దక్కిన 5వ పతకం కావడం విశేషం.

స్క్వాష్ సింగిల్స్‌ పురుషుల సింగిల్స్,మహిళల సింగిల్స్ ఈవెంట్లతో పాటు పురుషుల టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాలు వచ్చాయి.మహిళల సింగిల్స్‌లో దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప చెరో బ్రాంజ్ మెడల్ నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ ఘోషల్ కాంస్యం సొంతంచేసుకున్నాడు.పురుషుల టీమ్ ఈవెంట్‌లో సౌరవ్ ఘోషల్, హరిందర్ పాల్ సింగ్, రమిత్ టండన్, మహేష్ మంగోన్కర్‌లతో కూడిన భారత జట్టు సైతం కాంస్యమే నెగ్గగలిగింది.  స్వర్ణం సాధిస్తారనుకున్న భారత స్క్వాష్ క్వీన్స్ దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప టీమ్  ఈవెంట్‌లో రజతం...ఉమెన్స్ సింగిల్స్‌లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు.

Published by: Prasanth P
First published: September 1, 2018, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading