హోమ్ /వార్తలు /క్రీడలు /

Corona : ఆ టీమ్ లో ఏడుగురికి కరోనా.. కెప్టెన్ ని కూడా వదలని మహమ్మారి..

Corona : ఆ టీమ్ లో ఏడుగురికి కరోనా.. కెప్టెన్ ని కూడా వదలని మహమ్మారి..

Corona : ఆ టీమ్ లో ఏడుగురికి కరోనా.. కెప్టెన్ ని కూడా వదలని మహమ్మారి..

Corona : ఆ టీమ్ లో ఏడుగురికి కరోనా.. కెప్టెన్ ని కూడా వదలని మహమ్మారి..

Corona : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అసలు మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉండదని భావించిన చాలామంది.. సెకండ్ వేవ్ తీవ్రత చూసి బెంబేలెత్తిపోతున్నారు. లక్షల్లో నమోదవుతున్న కరోనా కేసులు, వేలల్లో నమోదవుతున్న మరణాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో ఎవరికీ క్లారిటీ లేదు.

ఇంకా చదవండి ...

  దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి పట్టపగ్గాలేకుండా విజృంభిస్తోంది. వైరస్‌ సంక్రమణ రోజుకొక కొత్త రికార్డును అధిగమిస్తోంది. దేశంలో వరుసగా మూడవ రోజు మూడు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం ఒక్కరోజే భారత్‌లో రికార్డు స్థాయిలో 3,46,786 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో గత మూడు రోజుల్లోనే 12 లక్షలకు పైగా కేసులు వచ్చాయ్. ఇక క్రీడా రంగంపైనా కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. చాలా మంది క్రీడాకారులు ఈ వైరస్ బారిన పడ్డారు. లేటెస్ట్ గా మహిళల హాకీ టీంలో కరోనా పడగ విప్పింది. ఏకంగా ఏడుగురు మహిళల క్రీడాకారుణులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరితో పాటు.. సపోర్ట్ స్టాఫ్ బృందంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది. బెంగళూరులోని సాయ్ శిక్షణ క్యాంపుకు వచ్చిన వీరందరీకి టెస్ట్ లు చేయగా పాజిటవ్ గా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో మహిళ టీం కెప్టెన్ రాణి రాంపాల్ కూడా ఉన్నారు.

  రాణి రాంపాల్ తో పాటు సవితా పునియా, షర్మిలా దేవి, రజని, నవజ్యోత్ కౌర్, సుశీల, నవనీత్ కౌర్ లకు కరోనా సోకింది. వీరితో పాటు వీడియో అనలిస్ట్ అమృతా ప్రకాష్ మరియు సైంటిఫిక్ సలహాదారు వేన్ లంబార్డ్ లకు కూడా కరోనా కాటు వేసింది. వీరందర్ని ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సాయ్ NCOE బెంగళూరులో వీరందరికి ప్రత్యేక చికిత్స అందుతోంది.

  Rani_Rampal
  మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్..

  మరోవైపు, పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో మరో మూడు వారాల తర్వాత పతాక స్థాయికి చేరుకొనున్నట్లు చెబుతున్నారు. మే రెండో వారం.. అంటే 11-15 తేదీల మధ్య వైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరే అవకాశాలున్నాయని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంతేకాదు అప్పటిలోగా యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఇక ఏయే రాష్ట్రాల్లో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందనే అంశంపై కూడా వారు ఓ అంచనాకు వచ్చారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Corona, Hockey

  ఉత్తమ కథలు