హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: చరిత్ర సృష్టించిన మహిళల హాకీ జట్టు.. ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌లోకి..

Tokyo Olympics: చరిత్ర సృష్టించిన మహిళల హాకీ జట్టు.. ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌లోకి..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

భారత మహిళా హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ 2020 సెమీఫైనల్‌కు దూసుకొని వెళ్లి చరిత్ర సృష్టించింది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి.. తొలి సారి సెమీఫైనల్ చేరుకున్నది.

  భారత మహిళా హాకీ జట్టు (Indian Women Hockey Team) టోక్యో ఒలింపిక్స్‌ 2020లో  (Tokyo Olympics) సంచనలనాలు సృష్టిస్తున్నది. తొలి సారిగా నాకౌట్ (Knock Out Stage) దశకు చేరుకున్న మహిళా జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో (Quarter final) మూడు సార్లు ఒలింపిక్ విజేత అయిన ఆస్ట్రేలియాను (Australia) 1-0 తేడాతో ఒడించి సెమీఫైనల్ (Semi Final) చేరింది. 22వ నిమిషంలో ఇండియన్ ప్లేయర్ గుర్జిత్ కౌర్ కొట్టిన గోలే మ్యాచ్ మొత్తంలో నమోదైన ఏకైక గోల్. ఈ విజయంతో తొలి సారి సెమీస్ చేరుకొని భారత జట్టు చరిత్ర సృష్టించింది. పూల్‌-ఏలో భాగమైన భారత జట్టు ఒలింపిక్స్ ప్రయాణం ఓటములతోనే ప్రారంభమైంది. ఐదు మ్యాచ్‌లలో వరుసగా మూడు మ్యాచ్‌లో ఓడిపోయింది. కానీ ఆ తర్వాత రెండు మ్యాచ్‌లు గెలిచి నాకౌట్ ఆశలు సజీవంగా ఉంచుకున్నది. మహిళా జట్టు క్వార్టర్ చేరుకోవడానికి బ్రిటన్-ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం దోహదపడింది. ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలిచి ఉంటే ఆ జట్టే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నేది. కానీ ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో గెలిచింది. భారత్, ఐర్లాండ్ జట్లు చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో సమానంగా నిలిచాయి. కానీ మెరుగైన గోల్స్ ఉండటంతో టీమ్ ఇండియా నాకౌట్ దశకు చేరుకున్నది. ఇక పూల్-బిలో ఆస్ట్రేలియా అన్ని మ్యాచ్‌లు గెలిచి టాప్ స్పాట్ నమోదు చేసింది. అలా పూల్ ఏ చివరి స్థానంలో ఉన్న ఇండియా, పూల్ బి అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా క్వార్టర్స్‌లో తలపడ్డాయి. వరల్డ్ నెంబర్ 2 జట్టును ఓడించి రాణీ రాంపాల్ బృందం సెమీస్ చేరుకున్నది.

  మ్యాచ్ ఆసాంతం ఆస్ట్రేలియా జట్టు భారత గోల్ పోస్టుపై దాడి చేస్తూనే ఉన్నది. ఆస్ట్రేలియా జట్టు 8 పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచకుండా భారత డిఫెండర్లు చక్కగా అడ్డుకున్నారు. భారత జట్టు సెమీ ఫైనల్‌లో వరల్డ్ నెంబర్ 1 అర్జెంటీనాతో తలపడనున్నది. బుధవారం తొలి సెమీఫైనల్ జరుగనున్నది.


  మరోవైపు పురుషుల హాకీ జట్టు కూడా 41 ఏళ్ల తర్వాత సెమీస్ చేరుకోవడం విశేషం. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తర్వాత పురుషుల జట్టు మరోసారి నాకౌట్‌కు చేరుకోలేదు. ఇప్పుడు మహిళల, పురుషుల జట్లు రెండో సెమీస్ చేరుకొని ఒలింపిక్ పతకాలపై ఆశలు పెంచాయి.

  Published by:John Kora
  First published:

  Tags: Olympics, Tokyo Olympics

  ఉత్తమ కథలు