హోమ్ /వార్తలు /క్రీడలు /

Veda Krishnamurthy: ఉమెన్ క్రికెటర్ వేదా కృష్ణమూర్తి పెళ్లి.. ఫొటోలు వైరల్‌..!

Veda Krishnamurthy: ఉమెన్ క్రికెటర్ వేదా కృష్ణమూర్తి పెళ్లి.. ఫొటోలు వైరల్‌..!

రంజి ప్లేయర్‌తో వేదా కృష్ణమూర్తి పెళ్లి

రంజి ప్లేయర్‌తో వేదా కృష్ణమూర్తి పెళ్లి

ఇండియన్‌ ఉమెన్ క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి (Veda Krishnamurthy) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. కర్ణాటక రంజీ ప్లేయర్‌ అర్జున్‌ హోయసలను (Arjun Hoysala) ఆమె పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆ జంట సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

sportఇండియన్‌ ఉమెన్ క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి (Veda Krishnamurthy) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. కర్ణాటక రంజీ ప్లేయర్‌ అర్జున్‌ హోయసలను (Arjun Hoysala) ఆమె పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆ జంట సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయగా.. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలోని పచ్చని ప్రకృతి అందాల మధ్య వేదా, అర్జున్‌ దిగిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

బెంగళూరులో నిశ్చితార్థం 

వేదా కృష్ణమూర్తి ఎంగేజ్‌మెంట్ సెప్టెంబర్ 18న బెంగళూరులో జరగనుంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు ధ్రువీకరించారు. నిశ్చితార్థానికి ముందు అర్జున్, వేద తీసుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. వేద కృష్ణమూర్తి ముందు మోకరిల్లి ఆమెకు అర్జున్ ప్రపోజ్ చేస్తున్న ఫోటోను ఫ్యాన్స్ ఎక్కువగా లైక్‌ చేస్తున్నారు. ఆ ఫోటోకు ‘ఆమె యస్ చెప్పింది’ అని అర్జున్ క్యాప్షన్ పెట్టాడు.

 కర్ణాటక రంజీ ప్లేయర్‌ అర్జున్‌

లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ అయిన అర్జున్ రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడాడు. రంజీలో చివరిసారిగా 2016లో మహారాష్ట్ర , కర్ణాటక మధ్య మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(PCA) బింద్రా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. చివరిసారిగా 2019 సీజన్‌లో శివమొగ్గ లయన్స్ తరఫున కర్ణాటక ప్రీమియర్ లీగ్(KPL)లో కనిపించాడు.

ఆ రెండు ఫైనల్స్‌లో ఆడిన వేదా

కోవిడ్-19 కారణంగా తన తల్లి, సోదరిని కోల్పోయిన తర్వాత వేదా కృష్ణమూర్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమె ప్రస్తుతం ఇండియన్‌ ఉమెన్ క్రికెట్‌ టీమ్‌కు ఎంపిక కాలేదు. త్వరలో తిరిగి జట్టులో స్థానం సంపాదించేందుకు కసరత్తు చేస్తోంది. ఇండియా తరఫున ఇప్పటి వరకు మొత్తం 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది ఈ కీ బ్యాటర్. ఇంగ్లండ్‌లో జరిగిన 2017 మహిళల వన్డే ప్రపంచ కప్, 2020 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరిన ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో ఆమె సభ్యురాలు. రెండు ఈవెంట్‌ల ఫైనల్‌లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ ఓడిపోయింది. అయినా ఫైనల్‌ వరకు ఇండియన్‌ ఉమెన్ క్రికెట్‌ టీం పోరాడిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది.

అయితే 2020 మార్చి 8న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో చివరిగా వేదా కృష్ణమూర్తి ఆడింది. అప్పటి నుంచి ఆమెకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియా తరఫున ఆడే అవకాశం లభించలేదు. వన్డేలలో చివరిసారిగా 2018లో నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడింది. కృష్ణమూర్తి 2017, 2018లో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్(BBL)లో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడింది. ఇటీవల ఆమె టెలివిజన్ స్టూడియోలో బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్వెల్త్ గేమ్స్(CWG) నిపుణురాలిగా కనిపించింది.

Published by:Sultana Shaik
First published:

Tags: Sports

ఉత్తమ కథలు