What a Catch : మైదానంలో హార్లిన్ డియోల్ అద్భుతమైన క్యాచ్.. మహిళా క్రికెటర్లో ఇలాంటి క్యాచ్ చూసి ఉండరు

హార్లిన్ డియోల్ బౌండరీ వద్ద పట్టిన అద్భుతమైన క్యాచ్ చూశారా? (Screen Grabber)

పురుషుల క్రికెట్‌లోకూడా ఇలాంటి క్యాచ్‌లు మనం అరుదుగా చూస్తుంటాము. ఎంతో చురుకుదనం, ఫిట్‌నెస్ ఉంటే కాని సాధ్యంకాని ఈ క్యాచ్‌ను యువ భారత క్రికెటర్ హార్లీన్ డియోల్ చేసి చూపించింది. ఇప్పుడు ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
    టీమ్ ఇండియా యువ క్రికెటర్ (Woman Cricketer) హార్లిన్ డియోల్ (Harleen Deol) తన అద్భుతమైన అథ్లెటిక్ స్కిల్స్ ప్రదర్శించింది. పురుషుల క్రికెట్‌లో కూడా కష్ట సాధ్యమయ్యే క్యాచ్‌ను హర్లీన్ డియోల్ పట్టేసి ఔరా అనిపించింది. సాధారణంగా మహిళా క్రికెట్ అంటే ఏదో గల్లీ క్రికెట్ లాగా భావించే చాలా మంది ఈ క్యాచ్ చూసి అమ్మాయిల ఫిట్‌నెస్, వారి చురుకుదనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక భారత యువతి ఈ క్యాచ్ పట్టడంతో ఇప్పుడు ఈ వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా శుక్రవారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ అమీ జోన్స్ 27 బంతుల్లో 43 పరుగులతో మంచి దూకుడు మీద ఉన్నది. శిఖా పాండే వేసిన 19వ ఓవర్ చివరి బంతిని భారీ షాట్ ఆడింది. అందరూ కచ్చితంగా బౌండరీనో.. సిక్సో వస్తుందని భావించారు. కానీ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హార్లీన్ డియోల్ అద్భుతం చేసింది. ముందుగా గాల్లోకి డైవ్ చేసుకొని బంతిని అందుకొని... బౌండరీ అవతల పడుతానేమో అని లోపలకు విసిరింది. తర్వాత తానే మరోసారి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నది. క్షణాల్లో జరిగిన ఈ అద్బుతానికి మైదానంలో ఉన్న వాళ్లే కాకుండా టీవీల ముందు చూస్తున్న వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు.

    హార్లీన్ సాహసానికి టీమ్ ఇండియా సభ్యులు అభినందించారు. ఈ వీడియో చూసిన ప్రముఖ వ్యాఖ్యాత లీసా స్తాలేకర్, ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్ర, భారత అభిమానులు హార్లీన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. భారత యువ మహిళా క్రికెటర్ల టాలెంట్‌ను అందరూ గుర్తించాల్సిన సమయం వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.



















    కాగా, ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా టీ20 సిరీస్‌ను కూడా ఓటమితో ప్రారంభించింది. నటాలీ షివర్ (55), ఆమీ జోన్స్ (43) రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు 177/7 స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత మహిళా జట్టు 8.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయీస్ పద్దతిలో ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంతో నిలిచింది.
    Published by:John Naveen Kora
    First published: