INDIAN TENNIS STAR SANIA MIRZA STRUGGLES IN GYM THROWING IN A MIX OF WORKOUTS TO LOSE WEIGHT WATCH SRD
Sania Mirza : పొట్ట తగ్గించడం కోసం తెగ కష్టపడుతున్న సానియా .. వైరల్ వీడియో..
Sania Mirza
Sania Mirza : సానియా ఎప్పటికప్పుడూ తన ఫోటోలను, తనకు సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. లేటెస్ట్ గా సానియా మీర్జా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
భారత ప్రముఖ టెన్నిస్ (Tennis) క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) అంటే తెలియనివారుండరు. సానియా మీర్జా తన టెన్నిస్ ఆటతోనే కాకుండా.. అందంతోనూ ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. ఇండియాలో టెన్నిస్ అంతలా పాపులర్ కావడానికి ఓ కారణం సానియా మీర్జా. సానియా మీర్జా ప్రపంచస్థాయి అగ్ర టెన్నిస్ క్రీడాకారిణిలని ధీటుగా ఎదుర్కొంది. క్రీడాకారిణిగా ఎంతో పేరు ప్రతిష్టలు సొంతం చేసుకున్న సానియా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ సానియా సొంతం. సానియా.. తన ఆటతో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు.. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. అంతేకాకుండా సానియాను ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ ఖేల్ రత్న కూడా వరించింది. సానియా కెరీర్లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఎప్పటికప్పుడూ తన ఫోటోలను, తనకు సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది సానియా. లేటెస్ట్ గా సానియా మీర్జా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
సానియా మీర్జా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేస్తోంది. బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ స్టార్.. తాజాగా తన వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో సానియా.. ఇతరుల్లానే జిమ్‌లో నానా కష్టాలు పడుతోంది. పింక్ టాప్, జిమ్ ప్యాంట్‌తో కనిపించిన సానియా.. రోప్ వర్కౌట్స్‌తో పాటు సైక్లింగ్, బాల్, యాబ్స్, జంప్/బాక్స్ ఎక్సర్సైజ్ చేస్తూ కనిపించింది.
బరువు తగ్గడంతో పాటు లోయర్ బాడీ మజిల్స్ బలంగా ఉంచుకోవడం కోసం సానియా ఈ ఎక్సర్సైజులు చేస్తున్నట్లు అర్థమవుతోంది. తన పొట్టను చూపిస్తూ దీని కోసమే ఈ కష్టమంతా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ వీడియోకు సునో కహో సునా అనే బాలీవుడ్ సాంగ్‌ను జత చేసి లిప్ సింక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
2013లోనే సింగిల్స్ ఆడటం మానేసిన సానియా డబుల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌ను కూడా అందుకుంది. దాదాపు 91 వారాలా పాటు నంబర్‌వన్‌గా కొనసాగింది. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 270 ప్లస్ సింగిల్స్ విజయాలందుకున్న హైదరాబాద్ ప్లేయర్.. డబుల్స్‌లో 500 ప్లస్ విక్టరీలు నమోదు చేసింది. సింగిల్స్‌లో సానియా అత్యుత్తమ ర్యాంక్ 27 కాగా.. డబుల్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఒక సింగిల్స్ టైటిల్‌తో పాటు 40 డబుల్స్ టైటిల్స్, 6 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుపొందింది. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో సానియా 14 పతకాలను సాధించింది. అందులో 6 బంగారు పతకాలున్నాయి. ఇక పాకిస్థానీ క్రికెటర్ సోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సానియా ఓ బిడ్డకు తల్లైంది. ప్రస్తుతం తన బిడ్డ ఆలనాపాలనా చూస్తోన్న సానియా మరోవైపు తన టెన్నిస్ అకాడమీని కూడా పర్యవేక్షిస్తోంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.