Sania Mirza : " హైదరాబాదీ ఆంటీలు ఇలా ఉండాలి " .. వైరలవుతున్న సానియా మీర్జా ఫన్నీ వీడియో..

సానియా మీర్జా Photo : Twitter

Sania Mirza : మొన్నటి వరకు అందరూ టిక్ టాక్ వీడియోలు చేసేవారు.. ఆ యాప్ బ్యాన్ అవ్వడంతో రీల్స్ తో గడిపేస్తున్నారు. ఈ రీల్స్ చేయడం వల్ల డబ్బు సంపాదించుకోవడంతో పాటు.. సెలబ్రెటీ హోదా పెంచుకుంటున్న వారు కూడా చాలా మందే ఉన్నారు.

 • Share this:
  భారత ప్రముఖ టెన్నిస్ (Tennis News) క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza Latest News) అంటే తెలియనివారుండరు. సానియా మీర్జా తన టెన్నిస్‌ ఆటతోనే కాకుండా.. అందంతోనూ ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. ఇండియాలో టెన్నిస్ అంతలా పాపులర్ కావడానికి ఓ కారణం సానియా మీర్జా. సానియా మీర్జా ప్రపంచస్థాయి అగ్ర టెన్నిస్ క్రీడాకారిణిలని ధీటుగా ఎదుర్కొంది. క్రీడాకారిణిగా ఎంతో పేరు ప్రతిష్టలు సొంతం చేసుకున్న సానియా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ సానియా సొంతం. సానియా.. తన ఆటతో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు.. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. అంతేకాకుండా సానియాను ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ ఖేల్ రత్న కూడా వరించింది. సానియా కెరీర్‌లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర స‌ృష్టించింది. ఎప్పటికప్పుడూ తన ఫోటోలను, తనకు సంబంధించిన విషయాల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది సానియా. లేటెస్ట్ గా సానియా మీర్జా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

  కిడి టచ్ ఇట్ అనే సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. టచ్ ఇట్‌ ట్రెండింగ్ డ్యాన్స్ ఛాలెంజ్‌తో నెటిజన్లు బిజీగా ఉన్నారు. ఈ ఫన్ ఛాలెంజ్‎తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నిండిపోయింది. ఈ టచ్ ఇట్ ఛాలెంజ్‎ను టెన్నీస్ స్టార్ సానియా మీర్జా ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో టచ్ ఇట్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆమె ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. హైదరాబాదీ ఆంటీలు ఎలా ప్రవర్తిస్తారో ఆమె చూపించడం గమనార్హం. ఇఫ్పటి వరకు దీనిని చాలా మంది చేయగా.. సానియా దానిని భిన్నంగా చేసింది.

  ఇది కూడా చదవండి : ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న కోహ్లీ..! ఆమె కోసం ఏం చేశాడంటే..

  వీడియోలో మీరు విడిపోతారని మేము పందెం వేశామంటూ క్లిప్ మొదలవుతుంది. తర్వాత ఇంట్లో నిలబడిన సానియా మరో అమ్మాయి తలపై తట్టారు. వీడియోపై ఒక టెక్ట్స్ కూడా రాశారు. దీనిలో “హైదరాబాదీ ఆంటీలు ఇలా ఉండాలి” అని రాసి ఉంది. మీరు ఈ విడియో చూస్తే నవ్వుతారని అన్నారు.
  View this post on Instagram


  A post shared by Sania Mirza (@mirzasaniar)

  ఈ వీడియోకు ఇప్పటికే 89,000 లైక్‌లు, కామెంట్స్ వచ్చాయి. కిడి ద్వారా టచ్ ఇట్ పాట 2021 లో గోల్డెన్ బాయ్ ఆల్బమ్‌లో విడుదల చేశారు. ఈ పాటలో ఆకట్టుకునే సాహిత్యం, మంచి ట్యూన్ ఉండటంతో తమ ప్లే లిస్ట్‎లో ఈ పాటను చేర్చుకున్నారు. ఇక, కరోనా ఎఫెక్ట్ తర్వాత సానియా తిరిగి టెన్నిస్ టోర్నీల్లో పాల్గొంటోంది. టోక్యో ఒలింపిక్స్ లో డబుల్స్ లో ఫస్ట్ రౌండ్ లో సానియా జోడి ఓడిపోయి టెన్నిస్ అభిమానుల్ని నిరాశపర్చింది.
  Published by:Sridhar Reddy
  First published: