INDIAN TENNIS STAR SANIA MIRZA ANNOUNCED ON WEDNESDAY THAT 2022 WILL THE FINAL SEASON OF HER DECORATED CAREER SRD
Sania Mirza : టెన్నిస్ ఫ్యాన్స్ కు భారీ షాక్.. సానియా మీర్జా సంచలన నిర్ణయం..!
Sania Mirza
Sania Mirza : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza)టెన్నిస్ ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఇండియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకుంది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza)టెన్నిస్ ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఇండియా టెన్నిస్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సానియా మీర్జా టెన్నిస్ నుంచి రిటైర్ కానుంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది సానియా. ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)లో ఓటమి తర్వాత సానియా మీర్జా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా, ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్సెక్-కాజా జువాన్ జోడీ 4-6, 6-7(5)తో గంటా 37 నిమిషాల్లో ఓటమి చవిచూశారు. అయితే సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి ఈ గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్‌లో పాల్గొంటుంది. "ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్నాను. నేను మొత్తం సీజన్లో ఆడగలనో లేదో తెలియదు. కానీ నేను మొత్తం సీజన్లో ఉండాలనుకుంటున్నాను" అని సానియా తెలిపింది.
2013లో సానియా సింగిల్స్ ఆడటం మానేసింది. అప్పటి నుంచి ఆమె డబుల్స్‌లో మాత్రమే ఆడుతోంది. సింగిల్స్‌లో ఆడుతున్నప్పుడు కూడా సానియా చాలా విజయాలు సాధించింది. ఆమె చాలా మంది పెద్ద టెన్నిస్ క్రీడాకారులను ఓడించి 27వ ర్యాంక్‌కు చేరుకుంది.
ఇండియన్ టెన్నిస్‌లో సంచలనం మన సానియా మీర్జా (Sania Mirza). దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓ దిక్సూచి. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటింది. డబుల్స్ లో ప్రపంచ నెం.1 ర్యాంకు సాధించింది. సానియా దాదాపు 91 వారాల పాటు డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్‌వన్‌గా కొనసాగింది. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ కు చేరిన ఒపెన్ ఎరాకు చెందిన మూడవ మహిళ సానియా. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో ఆమె 14 పతకాలను సాధించుకున్నారు. అందులో 6 బంగారు పతకాలు.
అక్టోబరు 2005లో టైం పత్రిక సానియాను "50 హీరోస్ ఆఫ్ ఆసియా"గా పేర్కొంది. ది ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఆమెను "33 విమెన్ హూ మేడ్ ఇండియా ప్రౌడ్" జాబితాలో చేర్చింది. 2013 నవంబరు 25లో మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణాసియా నుండి యుఎన్ మహిళల సౌహార్ధ అంబాసిడర్ గా సానియాను నియమించారు.
సానియా మీర్జా తన కొడుకు పుట్టిన తర్వాత 2018లో టెన్నిస్ కోర్టుకు దూరమైంది. ఆ తర్వాత రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేందుకు సానియా తన బరువును దాదాపు 26 కిలోలు తగ్గించుకుంది. ఆమె తిరిగి వచ్చిన తర్వాత, ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిచెనోక్‌తో కలిసి హోబర్ట్ ఇంటర్నేషనల్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. దీని తర్వాత ఆమె టోక్యో ఒలింపిక్స్ 2020లో కూడా ఆడింది. కానీ, అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.