Team India for World Cup 2019: ప్రపంచ కప్‌కు టీమిండియా జట్టు ప్రకటన..పంత్‌కు దక్కని చోటు

Team India for World Cup 2019: ఐపీఎల్‌లో అదరగొడుతున్న రిషబ్ పంత్‌కు స్థానం దక్కలేదు. అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్‌కు సైతం సెలెక్టర్లు షాకిచ్చారు. రిజర్వ్‌డ్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌కు జట్టులో స్థానం కల్పించారు.

news18-telugu
Updated: April 15, 2019, 4:49 PM IST
Team India for World Cup 2019: ప్రపంచ కప్‌కు టీమిండియా జట్టు ప్రకటన..పంత్‌కు దక్కని చోటు
టీంఇండియా (Image : Twitter)
news18-telugu
Updated: April 15, 2019, 4:49 PM IST
Team India for World Cup 2019: మే నెలాఖరులో ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ్ కప్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ముంబైలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కొహ్లీ హాజరయ్యారు. చర్చల అనంతరం 15 మంది సభ్యులతో జట్టును సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కొహ్లీ వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మకు వైస్ కెప్టన్ బాధ్యతలు అప్పగించారు.

ఐపీఎల్‌లో అదరగొడుతున్న రిషబ్ పంత్‌కు స్థానం దక్కలేదు. రిజర్వ్‌డ్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్‌లో కీపింగ్ అత్యంత కీలకం. ఒక వేళ మ్యాచ్‌లో ధోనీ లేకుంటే ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలన్న దానిపై సెలెక్టర్లు లోతుగా విశ్లేషించారు. అనంతరం రిజర్వ్‌డ్ కీపర్‌గా పంత్ కంటే కార్తీక్‌ వైపు మొగ్గుచూపారు. సీనియారిటీతో పాటు పంత్‌తో పోలిస్తే మెరుగ్గా కీపింగ్ చేయడంతోనే కార్తీక్‌కు చోటు కల్పించారు. ఇక సీనియర్ ప్లేయర్లు సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్‌, ఉమేశ్ యాదవ్‌కు సెలెక్టర్లు మొండి చేయి చూపారు.

భారత జట్టు ఇదే:

విరాట్ కొహ్లీ (కెప్టెన్ ), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ఎంస్ ధోనీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, జడేజా, మహ్మద్ షమీ.






First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...