అండర్-19 ప్రపంచ కప్ పోటీలకు సౌతాఫ్రికా వెళ్లిన టీమిండియా..

జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ ప్రపంచకప్ జరుగనుంది. ఇందులో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్‌తో పాటు న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్ జట్లు గ్రూప్‌ఎలో ఉన్నాయి.

news18-telugu
Updated: December 20, 2019, 11:08 PM IST
అండర్-19 ప్రపంచ కప్ పోటీలకు సౌతాఫ్రికా వెళ్లిన టీమిండియా..
అండర్ 19 భారత జట్టు
  • Share this:
అండర్ 19 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్లు సౌతాఫ్రికా బయలుదేరింది. జనవరిలో ఈ టోర్నమెంట్ జరుగనుంది. అయితే సౌతాఫ్రికా వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ముందుగానే అక్కడికి బయలు దేరింది. శుక్రవారం ముంబై అంతర్జాతీయ వినానాశ్రయం నుంచి భారత క్రికెట్ దక్షిణాఫ్రికాకు ప్రయాణమైంది. ప్రియం గార్గ్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ధ్రువ్ చంద్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్, దివ్యాంశ్ జోషి, శశ్‌వష్, శుభం హెగ్డే, రవి బిష్నోయి, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి, శుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్, కుమార్, అథర్వలు భారత చోటు సంపాదించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ ప్రపంచకప్ జరుగనుంది. ఇందులో పాల్గొనే జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్‌తో పాటు న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్ జట్లు గ్రూప్‌ఎలో ఉన్నాయి. కాగా, టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జనవరి 19న శ్రీలంకతో ఆడనుంది.

First published: December 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు