‘వోగ్’ మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన భారత స్టార్ అథ్లెట్ హిమాదాస్...

‘వుమెన్ ఆఫ్ ది ఇయర్- 2018’గా ఎంపికైన అస్సామీ అథ్లెట్... ఈ ఘనత సాధించిన మూడో భారత క్రీడాకారిణిగా రికార్డు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 3, 2018, 6:46 PM IST
‘వోగ్’ మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన భారత స్టార్ అథ్లెట్ హిమాదాస్...
‘వోగ్’ మ్యాగజైన్ కవర్‌పై హిమాదాస్...
  • Share this:
ఈ ఏడాది భారత యువ స్ప్రింటర్ హిమాదాస్‌కు బాగా కలిసి వస్తోంది. ఐఏఏఎఫ్‌లో స్వర్ణం పతకం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారత స్ప్రింటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఈ పరుగుల రాణి 2018 ఆసియా క్రీడల్లో రెండు రజతాలు, ఓ స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2018 ఏషియాడ్ 400 మీటర్ల ఈవెంట్‌లో50.79 సెకన్ల టైమింగ్‌తో ఇండియన్ నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ పరుగుల సునామీ... 4 X 400 మిక్స్‌డే రిలే ఈవెంట్‌లో రజతం, మహిళల 4 X 400 రిలే ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచి, సంచలనం సృష్టించింది.

నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ అస్సామీ ఆడపడుచు... ఇప్పుడు ఆ రాష్ట్రానికే స్పోర్ట్స్ అంబాసిడర్‌గా ఎంపికైంది. మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దాకా ఎందరో ప్రశంసలు పొందిన హిమాదాస్... ‘అర్జున’ అవార్డు కూడా అందుకుంది. ‘ఇండియాటుడే’ 50 మోస్ట్ పవర్‌ఫుల్ ఛేంజ్‌మేకర్స్ లిస్టులో స్థానం దక్కించుకున్న హిమాదాస్... ప్రముఖ ‘వోగ్’ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసింది. ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’ అంటూ పేర్కొంటూ భారత స్టార్ అథ్లెట్ హిమాదాస్ ఫోటోను కవర్‌పేజీపై ముద్రించింది వోగ్ మ్యాగజైన్.
‘వోగ్’ మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన భారత స్టార్ అథ్లెట్ హిమాదాస్...


ఇంతకుముందు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, టీమిండియా మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్ మాత్రమే ‘వోగ్’ మ్యాగజైన్ కవర్ పేజీ మీద దర్శనమిచ్చిన మహిళా క్రీడాకారులుగా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో 18 ఏళ్ల యువ సంచలనం కూడా చేరడం విశేషం.
First published: November 3, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>