ఇండియన్ సూపర్ లీగ్: తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ విజయం

అతిథ్య జట్టు అట్లెటికో డి కోల్‌కత్తాపై 2-0 తేడాతో విజయం... ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యువ సంచలనం హిమాదాస్‌!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 30, 2018, 4:07 PM IST
ఇండియన్ సూపర్ లీగ్: తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ విజయం
ఐసీఎల్ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ హిమాదాస్, కేరళ బ్లాస్టర్స్ జట్టు విజయానందం
  • Share this:
ఇండియన్ సూపర్ లీగ్ ఐదో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం కోల్‌కత్తాలో జరిగిన ప్రారంభోత్సవానికి భారత స్టార్ అథ్లెట్, స్ప్రింటర్ హిమాదాస్ ముఖ్యఅతిథిగా హాజరైంది. హిమాదాస్‌తో పాటు నీతూ అంబానీ, అభిషేక్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదటి మ్యాచ్‌లో హాట్ ఫెవరెట్ కేరళ బ్లాస్టర్స్ ఘనవిజయం సాధించింది. అతిథ్య జట్టు అట్లెటికో డి కోల్‌కత్తాపై 2-0 తేడాతో విజయం సాధించింది కేరళ బ్లాస్టర్స్.

మొదటి మూడు క్వార్టర్స్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ చేయలేకపోవడం విశేషం. చివరి క్వార్టర్‌లో 77వ నిమిషంలో గోల్ చేసిన పోప్లాట్నిక్ కేరళ బ్లాస్టర్స్ ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత 86వ నిమిషంలో స్టోజనోవిచ్ రెండో గోల్ కొట్టాడు. దీంతో రెండు గోల్స్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన కేరళ బ్లాస్టర్స్ జట్టు... ప్రత్యర్థి జట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. ప్రథమార్థంలో హోరాహోరీ పోటీ ఇచ్చిన అట్లెటికో డి కోల్‌కత్తా జట్టు... చివరి క్వార్టర్‌లో కేరళ బ్లాస్టర్స్ ఆటగాళ్ల దూకుడుకి తట్టుకోలేకపోయింది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అట్లెటికో సహా యజమాని సౌరభ్ గంగూలీతో పాటు కేరళ బ్లాస్టర్స్ సహా యజమాని టాలీవుడ్ నిర్మాత నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సచిన్ తన వాటాలు అమ్ముకున్న తర్వాత ‘కేరళ బ్లాస్టర్స్’ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేదు. టీవీలో మ్యాచ్ చూసి... మొదటి మ్యాచ్‌లో గెలిచిన కేరళ బ్లాస్టర్ జట్టుకు అభినందనలు తెలిపారు.

First published: September 30, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>