హోమ్ /వార్తలు /క్రీడలు /

Corona News : షాకింగ్.. భారత స్టార్ అథ్లెట్ కు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Corona News : షాకింగ్.. భారత స్టార్ అథ్లెట్ కు కరోనా.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Corona News

Corona News

Corona News : ప్రస్తుతానికి భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. థర్డ్ వేవ్ వస్తుందని గతంలో నిపుణులు హెచ్చరించినప్పటికీ.. ఇప్పుడైతే ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త కేసులతో పాటు మరణాలు తగ్గాయి. రికవరీలు ఎక్కువగా ఉన్నాయి.

  మానవాళి నుదుటి మీద కరోనా (Corona Latest News) రాస్తున్న మృత్యుశాసనానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రస్తుతానికి భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. థర్డ్ వేవ్ వస్తుందని గతంలో నిపుణులు హెచ్చరించినప్పటికీ.. ఇప్పుడైతే ఆ పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త కేసులతో పాటు మరణాలు తగ్గాయి. రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. ఇక, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరుకూ ప్రతి ఒక్కర్నీ పట్టి పీడిస్తోంది ఈ మహమ్మారి. ఇక, లేటెస్ట్ గా భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్​ (Indian Star Sprinter Himadas) కు కరోనా పాజిటివ్ (Corona Positive)​గా తేలింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. పాటియాలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (NIS)లో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హిమదాస్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నానని, ఆరోగ్య పరిస్థితిగా బాగానే ఉందని ఆమె ట్విటర్ వేదికగా తెలిపారు. తొడ కండరాల గాయం నుంచి హిమదాస్ ఇప్పుడిపుడే కోలుకుంటున్నారు. అంతలోనే ఆమెను కరోనా సోకింది. కరోనా నుంచి హిమదాస్ త్వరగా కోలుకోవాలి అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

  " నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నా. ఆరోగ్యం బాగానే ఉంది. కోలుకోవడంతో పాటు ఇంతకు ముందు కంటే బలంగా తిరిగి వచ్చేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి ఎదురు చూస్తున్నాను. దేశ ప్రజలందరూ మాస్క్ ధరించండి. సురక్షితంగా ఉండండి " అని హిమదాస్ ట్వీట్ చేశారు.

  భారత స్ప్రింటర్ హిమ దాస్

  ఆమె త్వరగా కోలుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ పేర్కొంది. ప్రత్యేక వైద్య బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపింది.

  హిమాదాస్‌ 2018లో అండర్‌-20 ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో విజయం సాధించారు. దీంతో, ఈ ఈవెంట్‌లో ప్రపంచ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయ స్ప్రింటర్‌గా రికార్డుల్లో నిలిచారు. జూలై-ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌ 2021కు హిమాదాస్‌ అర్హత సాధించలేకపోయారు. కండరాల ఒత్తిడి కారణంగా ఆమె కొంతకాలం విరామం తీసుకోగా.. ఈ నెల 10న పాటియాలా చేరుకున్నారు. అయితే ఈ నెల 8, 9 తేదీల్లో గౌహతిలో ఉన్న సమయంలోనే ఆమెకు కరోనా సోకి ఉండొచ్చని తెలుస్తోంది.

  ఇది కూడా చదవండి : " హైదరాబాదీ ఆంటీలు ఇలా ఉండాలి " .. వైరలవుతున్న సానియా మీర్జా ఫన్నీ వీడియో..

  ఈ నెల 8, 9 తేదీల్లో గౌహతిలో ఉన్న సమయంలోనే హిమాదాస్‌ కొద్దిగా అలసిపోయినట్లుగా కనిపించారని ఆమె కోచ్‌ గలీనా బుఖరినా పేర్కొన్నారు. ఆ సమయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని అనుకున్నామని, అయితే పాటియాలాలో కరోనా పరీక్షలు నిర్వహించిన సమయంలో కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Corona, Corona effect, Corona positive, Sports

  ఉత్తమ కథలు