INDIAN STAR JAVELIN THROWER NEERAJ CHOPRA WIN GOLD AT KUORTANE GAMES SJN
Neeraj Chopra: గాయపడి.. ఆ తర్వాత సింహంలా గర్జించిన నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రోలో ఏకంగా..
(PC : TWITTER)
Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) అదరగొట్టాడు. ఫిన్ లాండ్ (Finland) వేదికగా జరిగిని కూర్తానె గేమ్స్ లో పసిడి పతకంతో సత్తా చాటాడు. ఈ ఏడాది నీరజ్ చోప్రాకు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం.
Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) అదరగొట్టాడు. ఫిన్ లాండ్ (Finland) వేదికగా జరిగిని కూర్తానె గేమ్స్ లో పసిడి పతకంతో సత్తా చాటాడు. ఈ ఏడాది నీరజ్ చోప్రాకు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో జరిగిన ఫైనల్లో నీరజ్ చోప్రా తన జావెలిన్ ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. కెషర్న్ వాల్కట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో) 86.64 మీటర్ల దూరం విసిరి రజతాన్ని, అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 84.75 మీటర్లు విసిర కాంస్య పతకాలను సాధించారు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ మళ్లీ అటువంటి ప్రదర్శన చేయలేకపోయాడు. ఇటీవల జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొని రజతం సాధించాడు. అయితే తాజాగా కూర్తానె గేమ్స్ లో స్వర్ణం నెగ్గి ఫామ్ లోకి వచ్చాడు.
గాయపడ్డా..
జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్ ఆరంభానికి ముందు భారీ వర్షం కురిసింది. దాంతో గ్రౌండ్ మొత్తం చిత్తడి చిత్తడిగా మారింది. దాంతో పాటు రన్నప్ ఏరియాలో కూడా నీళ్లు చేరడంతో జారుడుగా మారింది. ఈ క్రమంలో జావెలిన్ ను త్రో చేయడానికి సిద్ధమైన నీరజ్.. విసిరే క్రమంలో జారిపడ్డాడు. అతడి చీలిమండ ట్విస్ట్ కాగా.. తల గ్రౌండ్ ను గట్టిగా తాకింది. దాంతో అందరూ అతడు గాయపడ్డాడని భావించారు. అయితే వెంటనే తేరుకున్న నీరజ్.. వెంటనే త్రోకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో అతడు 86.69 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సాధించాడు. ఈ ఫైనల్ ఈవెంట్ కు ముందు ఫైనల్లో తాను జావెలిన్ ను 90 మీటర్ల దూరం విసురుతానని ప్రకటించాడు. అయితే వర్షంతో పరిస్థితులు మారడంతో అది సాధ్యపడలేదు. లేకుండా అతడు చెప్పినట్లే 90 మీటర్ల దూరం విసిరేవాడేనేమో.
ఇక నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్నినెగ్గడంతో అతడిపై ప్రముఖుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్టిట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ’అతడు మళ్లీ సాధించాడు‘ అంటూ ట్వీట్ చేశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.