Neeraj Chopra : భారత దేశం (India)లో ఇప్పుడు నీరజ్ చోప్రా (Neeraj Chopra) అంటే తెలియని వారుండరు. గతేడాది టోక్యో (Tokyo) వేదికగా జరిగిన ఒలింపిక్స్ (olympics) గేమ్స్ లో భారత్ తరఫున బరిలోకి దిగిన నీరజ్ చోప్రా.. పురుషుల జావెలిన్ త్రోలో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి భారత ఖ్యాతిని విశ్వవేదికపై ఇనుమడింపజేసేలా చేశాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్ గా కూడా నీరజ్ చోప్రా నిలిచాడు. అంతకుముందు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత అథ్లెట్ పసిడి పతకం సాధించినా.. అతడు బ్రిటీష్ ఇండియా తరఫున ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు. ఇటీవలె జరిగిన ఒక ఈవెంట్ లో కూడా నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి : కార్తీక్ కాకాను అందుకే సెలెక్ట్ చేయలేదా.? లేదంటే ఇంకేమైనా మతలబు ఉందా?
ప్రస్తుతం నీరజ్ చోప్రా స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో జరుగుతున్న జావెలిన్ త్రో పోటీల్లో పాల్గొంటున్నాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈవెంట్ లో బరిలోకి దిగిన అతడు సిల్వర్ పతకాన్ని కూడా సాధించాడు. ఆటతో పాటు ఆఫ్ ఫీల్డ్ లో తన ప్రవర్తనతో ఈ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. తాజాగా స్టాక్ హోమ్ లోని పలువురు భారతీయులు నీరజ్ చోప్రాను కలిశారు. వారితో చాలా మర్యాదగా ప్రవర్తించిన నీరజ్ చోప్రా సెల్ఫీలు కూడా దిగాడు. వారికి వీడ్కోలు చెప్పే క్రమంలో తనను కలవడానికి వచ్చిన ఒక పెద్దాయన కాళ్లకు మొక్కి తన హోటల్ కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
So down to earth this person @Neeraj_chopra1 ❣️Took blessing from an elderly fan. That speaks volumes. Love you ❤️ pic.twitter.com/jjo9OxHABt
— Your ❤️ (@ijnani) June 30, 2022
ప్రతిష్టాత్మక ఈవెంట్లలో ఒక్క విజయం సాధిస్తే చాలు చాలా మంది ప్లేయర్స్ తమను తాము హీరోలుగా భావించే రోజులివి. స్టార్ డమ్, డబ్బు వస్తే చాలు అభిమానంతో తమను కలవడానికి వచ్చే ఫ్యాన్స్ ను సైతం పట్టించుకోని రోజులివి. కానీ, నీరజ్ చోప్రా ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని ఇతర అథ్లెట్లకు తన ప్రవర్తనతో చాటి చెప్పాడు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం అంటే చిన్న విషయం కాదు. అలాంటిదాన్ని సాధించినా కూడా నీరజ్ చోప్రా ప్రవర్తనలో ఎటువంటి మార్పులేదు. గతంలో ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. పెద్దవాళ్ల పట్ల అతడి ప్రవర్తనను వీడియోలో చూసిన వారు.. ’ప్రపంచానికి భారతీయుడు ఎలా ఉంటాడో చూపించావ్‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Games, India, India vs england, Neeraj chopra, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Tokyo, Tokyo Olympics