హోమ్ /వార్తలు /క్రీడలు /

PV Sindhu : గుజరాతీలా మారిపోయిన పీవీ సింధు.. నవరాత్రి వేడుకల్లో అదిరిపోయే స్టెప్పులతో హల్చల్

PV Sindhu : గుజరాతీలా మారిపోయిన పీవీ సింధు.. నవరాత్రి వేడుకల్లో అదిరిపోయే స్టెప్పులతో హల్చల్

PC : TWITTEER/
DD News Andhra

PC : TWITTEER/ DD News Andhra

PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) ఏదీ చేసినా సంచలనమే అవుతుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఒలింపిక్ (Olympics) పతకాలను సాధించిన ఆమె.. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) ఏదీ చేసినా సంచలనమే అవుతుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఒలింపిక్ (Olympics) పతకాలను సాధించిన ఆమె.. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. ఇక ఇటీవలె ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ (Common Wealth Games)లోనూ పసిడి పతకంతో మెరిసింది. అయితే కాలి గాయంతో బాధ పడుతున్న సింధు.. ఆటకు కొన్ని రోజులు విరామం ప్రకటించింది. దాంతో ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ (Badminton World Champion Ship)లో పాల్గొనలేదు. అయితే తాజాగా ఆమె గుజరాత్ లో మెరిసింది. దసరా పండుగ నేపథ్యంలో ప్రస్తుతం దేశమంతా దేవీ నవరాత్రలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్ లో జరిగిన నవరాత్రి వేడుకల్లో సింధు పాల్గొంది.

ప్రస్తుతం దేశ ప్రజలంతా దేవీ నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరపుకుంటున్నారు. నవరాత్రి వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా పాల్గొంది. గుజరాత్ లో జరిగిన నవరాత్రి వేడుకల్లో సింధు పాల్గొంది. అహ్మదాబాద్, సూరత్ లలో జరిగిన దేవీ నవరాత్రల్లో ఆమె పాల్గొనడం విశేషం. గుజరాతీ వస్త్రాదారణలో మెరిసిన సింధు.. అక్కడి ప్రజలతో కలిసి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవలె కాలంలో పీవీ సింధు చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఏడాది పాపులర్ సాంగ్ కచ్చా బాదంకు అదిరిపోయే స్టెప్పులు కూడా వేసింది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా సినిమా పాటలకు తాను చేసిన డ్యాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను హుషారెత్తించింది. దాంతో చాలా మంది సింధు సినిమావైపు అడుగులు వేస్తుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే అదేం లేదని తన ధ్యాసంతా ఆటపైనే ఉందంటూ ఆ వార్తలను సింధు కొట్టి పారేసింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Ahmedabad, Badminton, Gujarat, Pv sindhu, Surat

ఉత్తమ కథలు