HimaDas : ఆడపిల్ల కాదు.. ఆడపులి.. 18 రోజుల్లో 5 గోల్డ్ మెడల్స్

Hima Das | చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న అథ్లెటిక్స్‌లో హిమాదాస్ 400 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది.

news18-telugu
Updated: July 21, 2019, 6:55 PM IST
HimaDas : ఆడపిల్ల కాదు.. ఆడపులి.. 18 రోజుల్లో 5 గోల్డ్ మెడల్స్
హిమాదాస్ (Image:Twitter)
news18-telugu
Updated: July 21, 2019, 6:55 PM IST
హిమాదాస్. ఆడపిల్ల కాదు. ఆడపులి. ప్రస్తుతం ఆమెను ఇదే పేరుతో పిలుస్తున్నారు. ఎందుకంటే.. 130 కోట్ల మంది భారతీయులు గర్వంగా చెప్పుకొనేంత ఘనకార్యాన్ని సాధించింది. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న అథ్లెటిక్స్‌లో కేవలం 18 రోజుల్లో ఐదో గోల్డ్ మెడల్ సాధించింది. 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించింది. 52.09 సెకన్ల రికార్డు సమయంలో ఆమె ఈ ఘనతను సాధించింది. 2018లో జరిగిన ఆసియా గేమ్స్‌లో ఆమె వ్యక్తిగత రికార్డు (50.79) కంటే ఇది రెండు సెకన్లు ఎక్కువ. అసోంకి చెందిన 19 ఏళ్ల అథ్లెటిక్ చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న పోటీల్లో ఇప్పటి వరకు ఐదు గోల్డ్ మెడల్స్ సాధించింది. అయితే, 400 మీటర్ల వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌కు మాత్రం అర్హత సాధించలేకపోయింది. అర్హత సాధించేందుకు 51.80 సెకన్లలోనే గమ్యాన్ని చేరాల్సి ఉంది. అయితే, తృటిలో చాన్స్ మిస్ అయింది.

First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...