భారత షూటర్లు అక్కడా అదరగొట్టారు!

2020 ఒలింపిక్ పోటీలకు అర్హత సాధించిన అంజుమ్ మౌడ్గిల్, అపూర్వి చండేలా... ఐఎస్ఎస్ఎఫ్ ఛాంపియన్‌షిప్ లోనూ అదరగొడుతున్న భారత షూటర్లు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 3, 2018, 3:44 PM IST
భారత షూటర్లు అక్కడా అదరగొట్టారు!
భారత షూటర్లు
  • Share this:
ఏషియాడక్ 2018లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత షూటర్లు దక్షిణ కొరియాలోని చాంగ్వాన్‌లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) ఛాంపియన్‌షిప్ లోనూ అదరగొడుతున్నారు. ఏషియాడ్ 2018లో భారత షూటర్లు 2 స్వర్ణ పతకాలతో పాటు 4 రజత పతకాలు, 3 కాంస్య పతకాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్ విభాగంలో సాధించిన 19 పతకాల తర్వాత షూటింగ్‌లోనే భారత్‌కు ఎక్కువ పతకాలు లభించడం విశేషం.

ఇండోనేషియాలో గురి తప్పని షూటర్లు, దక్షిణ కొరియాలోనూ అదరగొడుతున్నారు. ట్రాప్ ఉమెన్ జూనియర్ ఫైనల్‌కి చేరిన మనీషా ఖీర్ సిల్వర్ మెడల్ సాధించింది. అంతేకాకుండా జూనియర్ వరల్డ్ రికార్డును సమం చేసి, సంచలనం సృష్టించింది. అలాగే 50 మీటర్ల జూనియర్ ఫిస్టల్ మెన్స్ ఈవెంట్‌లో అర్జున్ సింగ్ చీమకు స్వర్ణం పతకం, గౌరవ్ రాణాకి కాంస్య పతకం వరించింది. టీమ్ ఈవెంట్‌లో అర్జున్ చీమా, గౌరవ్ రాణా, అన్మోల్ జైన్ బృందం స్వర్ణం గెలుచుకుంది.

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అంజుమ్ మౌడ్గిల్ రజతం సాధించగా, అపూర్వి చండేలా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విజయంతో ఇద్దరూ 2020 ఒలింపిక్ ఈవెంట్‌కు అర్హత సాధించడం విశేషం. ఒలింపిక్స్‌కు క్వాలిఫై మొదటి భారత షూటర్స్ జోడిగా వీరు రికార్డు క్రియేట్ చేశారు. అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో మౌడ్గిల్, చండేలా, గోష్ మెహులీ జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.

ఇవీ చదవండి...

ఏషియాడ్:50 మీ. రైఫిల్ షూటింగ్‌లో సంజీవ్‌‌ రాజ్‌పుత్‌కు రజతం


PICS: 2018 ఏషియాడ్‌లో 'గురి' తప్పని భారత షూటర్లు


ఏషియాడ్‌: భారత్‌కు స్వర్ణం అందించిన 16 ఏళ్ల సౌరభ్ చౌదరి

First published: September 3, 2018, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading