క్రికెట్ లవర్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న IPL-2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్-కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 12 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ ఏడాది లీగ్ లో 10 జట్లలో ఒక్కొక్కటి 7 మ్యాచ్ లు విదేశాల్లో మిగతావి హోమ్ గ్రౌండ్ లో ఆడనున్నాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్ లు జరగనున్నాయి. మార్చి 31న ప్రారంభం కానున్న లీగ్ మ్యాచ్ లు మే 21 వరకు కొనసాగనున్నాయి. ఇక ఫైనల్ పోరు మే 28న జరగనుంది.
మొత్తం 70 మ్యాచుల్లో 17 డబుల్ హెడర్స్ (ఒకే రోజు రెండు మ్యాచ్ లు) మ్యాచ్ లు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో ఈ డబుల్ హెడర్స్ మ్యాచ్ లు జరగనున్నాయి. డబుల్ హెడర్స్ మ్యాచ్ ఉన్న రోజుల్లో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు, మిగిలిన రోజుల్లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ లు ప్రారంభం అవుతాయి.
రెండు గ్రూప్ లుగా 10 జట్లు..
Group A: ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్
Group B: పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్
ఇదిలా ఉంటే క్వాలిఫైర్ మ్యాచ్ లకు సంబంధించి తేదీలపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ను బీసీసీఐ ఇటీవల రిలీజ్ చేసింది. WPL సీజన్ తొలి మ్యాచ్ మార్చి 4న జరగనుండగా ఫైనల్ మార్చి 26న జరగనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ ముగిసిన 4 రోజులకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఇక మార్చి నుండి ఏప్రిల్ వరకు క్రికెట్ ప్రియులకు పండగే అన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Delhi capital, Gujarat Titans, IPL, IPL 2023 Mini Auction, Kings XI Punjab, Lucknow Super Giants, Mumbai Indians, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad