హోమ్ /వార్తలు /క్రీడలు /

Paralympics: పారాలింపిక్స్‌లో కొనసాగుతున్న భారత పతకాల వేట.. నేడు మూడు పతకాలు సాధించిన అథ్లెట్లు

Paralympics: పారాలింపిక్స్‌లో కొనసాగుతున్న భారత పతకాల వేట.. నేడు మూడు పతకాలు సాధించిన అథ్లెట్లు

పతకాలు కొల్లగొడుతున్న భారత పారా అథ్లెట్లు (PC: Twitter)

పతకాలు కొల్లగొడుతున్న భారత పారా అథ్లెట్లు (PC: Twitter)

పారాలింపిక్స్ 2020లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు 10 పతకాలు సాధించి భారత కీర్తి పతాకను ఎగురవేశారు. వారికి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

టోక్యో వేదికగా (Tokyo)  జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో (Paralympics 2020) భారత పారా అథ్లెట్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే 8 పతకాలు సాధించిన అథ్లెట్లు తాజాగా మంగళవారం మరో రెండు పతకాలు సాధించారు. పురుషుల హైజంప్‌లో స్టార్ అథ్లెట్ మరియప్పన్ తంగవేలు (Mariyappan Tangavelu) రజతంతో మెరిశాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మరియప్పన్.. ఈ సారి రజతానికే పరిమితం అయ్యాడు. ఇక హైజంప్‌లోనే శరద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. మరియప్పన్ ఈ సారి పారాలింపిక్స్ పరేడ్‌లో భారత పతాకాన్ని చేత బట్టు ముందుగా నడవాల్సి ఉన్నది. కానీ కరోనా పాజిటివ్ అయిన వ్యక్తికి క్లోజ్ కాంటాక్ట్ కావడంతో ఓపెనింగ్ సెర్మనీ సమయానికి క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్ నుంచి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తంగవేలు నేరుగా హైజంప్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అయితే గత పారాలింపిక్స్ కంటే ఈ సారి అతడి ప్రదర్శన తగ్గడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు.

అంతకు ముందు షూటింగ్‌లో భారత పారా అథ్లెట్ సింగ్‌రాజ్ అధాన కాంస్య పతకం సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో 216.8 పాయింట్లలో మూడో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన చావో యాంగ్ 237.9 పాయింట్లతో స్వర్ణం, మరో చైనా షూటర్ హువాంగ్ జింగ్ 237.5 పాయింట్లతో రజతం గెలవగా అధాన కాంస్యం సాధించాడు. భారత్‌కు చెందిన మరో షూటర్ మనీశ్ అగర్వాల్ ఏడో స్థానంలో నిలిచాడు. ఈ రోజు పతకాలు సాధించిన తంగవేలు, శరద్ కుమార్, సింగ్ రాజ్ అధానకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

భారత అథ్లెట్లు సాధించిన పతకాలు..

అవని లేఖర: స్వర్ణ పతకం - మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ - ఎస్‌హెచ్1

సుమిత్ అంటిల్ : స్వర్ణ పతకం - పురుషుల జావెలిన్ త్రో - ఎఫ్64

యోగేశ్ కథూనియా : రజత పతకం - పురుషుల డిస్కస్ త్రో - ఎఫ్56

నిషాద్ కుమార్ : రజత పతకం - పురుషుల హై జంప్ - టీ47

మరియప్పన్ తంగవేలు : రజత పతకం - పురుషుల హైజంప్ - టీ63

దేవేంద్ర : రజత పతకం - పురుషుల జావెలిన్ త్రో - ఎఫ్46

భవానీబెన్ పటేల్ : రజత పతకం - మహిళల టేబుల్స్ టెన్నిస్ - క్లాస్ 4

శరద్ కుమార్ : కాంస్య పతకం - పురుషుల హైజంప్ - టీ63

సుందర్ సింగ్ గుర్జార్ : కాంస్య పతకం - పురుషుల జావెలిన్ త్రో - ఎఫ్46

సింగ్‌రాజ్ అధాన : కాంస్య పతకం - పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ - ఎస్‌హెచ్ 1

Vasoo Paranjape: గవాస్కర్, సచిన్, ద్రవిడ్, కుంబ్లే, రోహిత్ శర్మ.. ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దిన కోచ్ హఠాన్మరణం


 

First published:

Tags: Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు