పారాలింపిక్స్ 2020లో (Paralympics 2020) భారత పారా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే 15 పతకాలను సాధించిన పారా అథ్లెట్లు ఆ పతకాల సంఖ్యను మరింత పెంచనున్నారు. బ్యాడ్మింటన్‌లో ఇద్దరు షట్లర్లు శనివారం ఫైనల్ చేరుకున్నారు. దీంతో వీరికి స్వర్ణం లేదా రజత పతకం ఖాయమైంది. పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్ కేటగిరీ సెమీ ఫైనల్లో కృష్ణ నగార్ 21-10, 21-11 తేడాతో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన క్రిస్టెన్ కూంబ్స్పై విజయం సాధించాడు. ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన చూ మన్తో తలపడనున్నాడు. ఆ మ్యాచ్‌లో ఓడినా కృష్ణకు రజత పతకం లభిస్తుంది. ఇక కాంస్య పతకం మ్యాచ్‌లో క్రిస్టెన్ కూంబ్స్-విక్టర్ గొన్జాల్వెస్ తలపడనున్నారు. ఇక నోయిడా జిల్లా కలెక్టర్ సుహాస్ యతిరాజ్ ఎస్ఎల్ 4 కేటగిరీలో బ్యాడ్మింటన్ ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన సెతియవాన్పై 21-9, 21-15 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్లో ఆయన ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ మజుర్‌తో తలపడనున్నారు. ఈ రెండు ఫైనల్స్ ద్వారా భారత్‌కు రెండు పారా ఒలింపిక్ పతకాలు ఖాయమనే చెప్పుకోవచ్చు.
We can't stop staring at these breathtaking pictures from the Victory Ceremony of #ManishNarwal & @AdhanaSinghraj ?????????? #Praise4Para #ProudParalympian #ParalympicsTokyo2020 #shootingparasport https://t.co/JrXXD1IYjc
— Paralympic India ?? #Cheer4India ? #Praise4Para (@ParalympicIndia) September 4, 2021
భారత అథ్లెట్లు సాధించిన పతకాలు..
అవని లేఖర: స్వర్ణ పతకం - మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ - ఎస్‌హెచ్1
సుమిత్ అంటిల్ : స్వర్ణ పతకం - పురుషుల జావెలిన్ త్రో - ఎఫ్64
యోగేశ్ కథూనియా : రజత పతకం - పురుషుల డిస్కస్ త్రో - ఎఫ్56
నిషాద్ కుమార్ : రజత పతకం - పురుషుల హై జంప్ - టీ47
మరియప్పన్ తంగవేలు : రజత పతకం - పురుషుల హైజంప్ - టీ63
దేవేంద్ర : రజత పతకం - పురుషుల జావెలిన్ త్రో - ఎఫ్46
భవానీబెన్ పటేల్ : రజత పతకం - మహిళల టేబుల్స్ టెన్నిస్ - క్లాస్ 4
శరద్ కుమార్ : కాంస్య పతకం - పురుషుల హైజంప్ - టీ63
సుందర్ సింగ్ గుర్జార్ : కాంస్య పతకం - పురుషుల జావెలిన్ త్రో - ఎఫ్46
సింగ్‌రాజ్ అధాన : కాంస్య పతకం - పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ - ఎస్‌హెచ్ 1
ప్రవీణ్ కుమార్ : రజత పతకం - పురుషుల హై జంప్ - టీ64
అవని లేఖరా: కాంస్య పతకం - మహిళల 50 మీటర్ల 3 పొజిషన్ - ఎస్‌హెచ్1
హర్వీందర్ సింగ్ : కాంస్య పతకం - పురుషుల వ్యక్తిగత రికర్వ్
మనీశ్ నర్వాల్ : స్వర్ణ పతకం - పురుషుల 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ - ఎస్‌హెచ్1
సింగ్‌రాజ్ అదానా: రజత పతకం - పురుషుల 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ - ఎస్‌హెచ్1
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics