హోమ్ /వార్తలు /క్రీడలు /

Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు.. సుమిత్‌కు పతకం

Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు.. సుమిత్‌కు పతకం

పారాలింపిక్స్ 2020లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ సుమిత్ (PC: SAI)

పారాలింపిక్స్ 2020లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ సుమిత్ (PC: SAI)

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో భారత ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. జావెలిన్ త్రో ఎఫ్62 కేటగిరీలో సుమిత్ అంటిల్ 68.55 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డు సృష్టించడంతో పాటు స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.

  టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో (Paralympics) భారత పారా అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతున్నది. సోమవారం పురుషుల జావెలిన్ త్రో (Javelin Throw) ఎఫ్62 కేటగిరీలో ఇండియన్ అథ్లెట్ సుమిత్ అంటిల్ (Sumit Antil) 68.55 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం  (Gold Medal) సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్‌లో తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్ల దూరం విసిరి వరల్డ్ రికార్డు సృష్టించాడు. అయితే 5వ ప్రయత్నంలో ఏకంగా 68.55 మీటర్ల దూరం విసిరి తన వరల్డ్ రికార్డును మరోసారి సవరించాడు. ఆస్ట్రేలియాకు చెందిన మైఖల్ బురెయిన్ 66.29 మీటర్ల దూరం విసిరి రజతం, శ్రీలంకకు చెందిన దులాన్ కొడితువాక్కు రజత పతకం గెలిచుకున్నాడు. ఇండియాకే చెందిన సందీప్ చౌదరి 62.20 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంల నిలిచాడు.

  సుమిత్ అంటిల్ విసిరిన మూడు సార్లు ప్రపంచ రికార్డులను తిరగ రాశాడు. తొలి సారి 66.95, రెండో సారి 68.08 మూడో సారి 68.55 మీటర్లతో వరుసగా ప్రపంచ రికార్డులు సవరించుకుంటూ వెళ్లాడు. భారత అథ్లెట్ల బృందం సోమవారం మొత్తం 5 పతకాలు సాధించగా.. ఇందులో రెండు స్వర్ణ పతకాలు ఉన్నాయి. షూటింగ్‌లో అవని లేఖర స్వర్ణ పతకం సాధించగా.. ఇప్పుడు సుమిత్ అంటిల్ మరో స్వర్ణంతో మెరిశాడు.


  సుమిత్ అంటిల్ హర్యాణా రాష్ట్రంలోని సోనేపట్‌కు చెందిన యువకుడు. 2015 వరకు ఆరోగ్యవంతంగా ఎలాంటి లోపం లేకుండానే తన జీవితాన్ని కొనసాగించాడు. అయితే 2015లో జరిగిన బైక్ ఆక్సిడెంట్‌లో సుమిత్ తన ఎడమ కాలును కోల్పోవలసి వచ్చింది. అప్పటి నుంచి కృత్రిమ కాలు అమర్చుకొని జీవనం సాగించాడు. కాగా, సోనేపట్‌లో ఒక పారా అథ్లెట్‌ను చూసిన సుమిత్‌కు కూడా అథ్లెటిక్స్ పైన ఆసక్తి పెరిగింది. అలా జావెలిన్ త్రోను ఎంచుకున్నాడు. 2018 నుంచి జావెలిన్ త్రోను సీరియస్‌గా తీసుకున్నాడు. 2019లో దుబాయ్‌లో నిర్వహించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో ఎఫ్-64 విభాగంలో రజత పతకం సాధించాడు. ఈ ఏడాది పాటియాలాలో నిర్వహించిన ఇండియన్ గ్రాండ్ ప్రీ సిరీస్ 3 పోటీల్లో పోటీల్లో ఏకంగా నీరజ్ చోప్రాతో కూడా పోటీ పడ్డాడు. అయితే సుమిత్ అప్పుడు కేవలం 66.43 మీట్ల దూరం మాత్రమే విసిరి 7వ స్థానంలో నిలిచాడు. అయితే ఇప్పుడు వేర్వేరు ఒలింపిక్స్‌లో పాల్గొన్న నీరజ్ చోప్రా, సుమిత్ అంటిల్ ఇద్దరూ స్వర్ణాలు సాధించడం విశేషం. నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించగా.. సుమిత్ అంటిల్ పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.

  Published by:John Kora
  First published:

  Tags: Olympics, Tokyo Olympics